రూ.100కోసం గొడవ.. పురుషాంగాన్ని కొరికేసిన మందుబాబు

Published : Aug 29, 2019, 02:54 PM IST
రూ.100కోసం గొడవ.. పురుషాంగాన్ని కొరికేసిన మందుబాబు

సారాంశం

తాగిన మైకంలో వంద రూపాయలు అడిగినందుకు వెంకటేశ్వరరావుపై తిరగపడ్డాడు. ఈ క్రమంలో ఇద్దరి మధ్యా విపరీతంగా గొడవ జరిగింది. మాటా మాటా పెరిగి ఘర్షణకు దారి తీసింది. ఈ క్రమంలో వెంకటేశ్వర్లు పంచె ఊడిపోయింది. 

కేవలం రూ.100కోసం గొడవ పడ్డారు. ఇచ్చిన వంద రూపాయలు తిరిగి అడిగాడనే కోపంతో  ఓ మందుబాబు మరో వ్యక్తి పురుషాంగాన్ని కోసేశాడు. ఈ సంఘటన ఆంధ్రప్రదేశ్ లోని కర్నూలు జిల్లా కోవెలకుంటలో చోటుచేసుకుంది. 

పూర్తి వివరాల్లోకి వెళితే... జోళదరాశి గ్రామానికి చెందిన వడ్డే వెంకటేశ్వర్లు ఓ రోజు అదే గ్రామానికి చెందిన వడ్డే వెంకట సుబ్బయ్యకు రూ.100 అప్పు ఇచ్చాడు. కొద్ది రోజుల తర్వాత తన వద్ద తీసుకున్న  వందరూపాయలను తిరిగి ఇవ్వాలని వెంకటేశ్వర్లు.. సుబ్బయ్యను కోరాడు. అయితే.. సుబ్బయ్య ఇవ్వకుండా  తప్పించుకు తిరిగాడు. దీంతో వెంకటేశ్వర్లు సుబ్బయ్య పై కోపం పెంచుకున్నాడు.  తన డబ్బులు తనకు ఇవ్వాలని తాజాగా బుధవారం వెంకటేశ్వరరావు సుబ్బయ్యను అడుగాడు.

ఆ సమయంలో సుబ్బయ్య పీకలదాకా తాగి ఉన్నాడు. దీంతో... ఆ తాగిన మైకంలో వంద రూపాయలు అడిగినందుకు వెంకటేశ్వరరావుపై తిరగపడ్డాడు. ఈ క్రమంలో ఇద్దరి మధ్యా విపరీతంగా గొడవ జరిగింది. మాటా మాటా పెరిగి ఘర్షణకు దారి తీసింది. ఈ క్రమంలో వెంకటేశ్వర్లు పంచె ఊడిపోయింది. దీంతో సుబ్బయ్య అతడి మర్మాంగాన్ని కొరికేశాడు. బాధతో విలవిల్లాడుతున్న వెంకటేశ్వర్లును స్థానికులు నంద్యాల ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లారు. వైద్యపరీక్షలు నిర్వహించిన డాక్టర్లు వెంటనే సర్జరీ చేయాలని తెలిపారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. 

PREV
click me!

Recommended Stories

తిరుమల వైకుంఠ ద్వార దర్శనంచేసుకున్న సీఎం రేవంత్ రెడ్డి | Asianet News Telugu
Tirumala Vaikunta Ekadashi: వైకుంఠ ఏకాదశి పర్వదినాన తిరుమలలో స్వర్ణరథం | Asianet News Telugu