ఉమ్మడి అనంతపురం జిల్లా గుంతకల్లులో డ్రగ్స్ కలకలం రేపుతున్నాయి. డ్రగ్స్ సరఫరా చేస్తున్న ముగ్గురిని పోలీసులు అరెస్ట్ చేశారు మరో ఇద్దరిని పోలీసులు అరెస్ట్ చేశారు. మరో ఇద్దరు పారిపోయారు.
అనంతపురం: ఉమ్మడి అనంతపురం జిల్లా గుంతకల్లులో Drugs కలకలం చోటు చేసుకుంది. రైల్వే పార్శిల్ కార్యాలయం సమీపంలో డ్రగ్స్ పంచుతున్న సమయంలో పోలీసులు దాడి చేశారు. డ్రగ్స్ సరఫరా చేస్తున్న ముగ్గురిని అరెస్ట్ చేశారు. మరో ఇద్దరు పారిపోయారు. పారిపోయిన వారి కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు.
20.64 గ్రాముల Cocaine,ను పోలీసులు సీజ్ చేశారు. దీని విలువ రూ.6.15 లక్షలు ఉంటుంది. కొకైన్ తో Mephedrone ను కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. గోవారం నాడు Hyderabad కు డ్రగ్స్ సరఫరా చేస్తున్నారని పోలీసులు గుర్తించారు.
ఈ నెల 24న నగరంలోని ధూల్‌పేట లో డ్రగ్స్ ను పోలీసులు పట్టుకున్నారు. ఇద్దరు డ్రగ్స్ పెడ్లర్లతో పాటు ఓ ఆఫ్రికన్ దేశస్తుడిని కూడా పోలీసులు అరెస్ట్ చేశారు. వీరి నుండి కొకైన్ ను ఇన్నోవా కారును స్వాధీనం చేసుకున్నారు.
డ్రగ్స్ కేసులో అరెస్టైన హైద్రాబాద్ వ్యాపార వేత్తల తీరు మారలేదు. పంజాగుట్ట డ్రగ్స్ కేసులో అరెస్టైన ఓ వ్యాపారి తన డ్రైవర్ ను ధూల్ పేటలో డ్రగ్స్ కొనుగోలు కోసం పంపిచారని సమాచారం. డ్రగ్స్ కొనుగోలుకు వెళ్లిన డ్రైవర్ లియాఖత్ పోలీసులకు చిక్కాడు. తమ యజమాని కోసమే డ్రగ్స్ కొనుగోలు చేయడానికి వచ్చినట్టుగా అతను పోలీసులకు సమాచారం ఇచ్చారు. డ్రైవర్ పోలీసులకు పట్టుబడిన విషయం తెలియగానే డ్రగ్స్ కొనుగోలు చేయాలని పంపిన వ్యాపారి పరారీలో ఉన్నాడని పోలీసులు చెప్పారు.
ఈ నెల 8వ తేదీన హైద్రాబాద్‌లో అంతర్జాతీయ డ్రగ్స్ పెడ్లర్ ఆశీష్ ను పోలీసులు అరెస్ట్ చేశారు. ఫార్మా వ్యాపారం పేరుతో ఆశిష్ జైన్ డ్రగ్స్ వ్యాపారం చేస్తున్నారని పోలీసులు చెప్పారు. ఆశిష్ జైన్ ఇంట్లో ఎన్సీబీ అధికారులు సోదాలు నిర్వహించారు.ఈ సోదాల్లో రూ. 3.71 కోట్లు స్వాధీనం చేసుకొన్నారు. అమెరికాతో పాటు పలు విదేశాలకు డ్రగ్స్ సరఫరా చేస్తున్నారని ఎన్సీబీ గుర్తించారు. ఫార్మా ముసుగులో ఆశీష్ డ్రగ్స్ వ్యాపారం చేస్తున్నారని ఎన్సీబీ గుర్తించింది., బిట్ కాయిన్, క్రిఫ్టో కరెన్సీ ద్వారా లావా దేవీలు జరిగాయని కూడా అధికారులు గుర్తించారు.ఇంటర్ నెట్ పార్మసీ, జీఆర్ ఇన్‌పీనిటీ పేరుతో ఆశీష్ జైన్ వ్యాపారం చేస్తున్నారని ఎన్సీబీ గుర్తించింది. గత రెండేళ్లలో వెయ్యికి పైగా విదేశాలకు ఆర్డర్లు పంపిన విషయాన్ని కూడా ఎన్సీబీ గుర్తించింది.
న్యూఢిల్లీకి చెందిన ఎన్సీబీ అధికారుల బృందం హద్రాబాద్ లోని హిమాయత్ నగర్ ఇంట్లో సోదాలు నిర్వహించారు.ఈ సోదాల్లో డ్రగ్స్ ను కూడా సీజ్ చేశారు.ఆశీష్ జైన్ సింథటిక్ డ్రగ్స్ ను సరఫరా చేస్తున్నట్టుగా గుర్తించారు. ఈ నెల 5వ తేదీన ఎన్సీబీ అధికారులతో పాటు స్థానికంగా ఉన్న అధికారులు కూడా హైద్రాబాద్ నగరంలో మూడు చోట్ల ఏక కాలంలో సోదాలు నిర్వహించారు. ఆశీష్ జైన్ వెనుక ఎవరైనా ఉన్నారా అనే కోణంలో కూడా పోలీసులు ఆరా తీస్తున్నారు.
also read:కర్ణాటకలో రూ. 90 లక్షల డ్రగ్స్ సీజ్: ఏపీకి లింకులు, విజయవాడలో ఒకరి అరెస్ట్
ఇంటర్నెట్ సహాయంతో విదేశాలకు ఫోన్ కాల్స్ వెళ్తున్న విషయాన్ని గుర్తించిన న్యూఢిల్లీ ఎన్సీబీ అధికారులు ఆశీష్ జైన్ పై నిఘాను ఏర్పాటు చేశారు.డ్రగ్స్ ను విదేశాలకు డ్రగ్స్ ను సరఫరా చేస్తున్న విషయాన్ని ఎన్సీబీ అధికారులు గుర్తించారు. వెంటనే ఎన్సీబీ అధికారులు హైద్రాబాద్ లోని ఆశీష్ జైన్ ఇంటిపై దాడి చేశారు.
తెలంగాణ రాష్ట్రాన్ని డ్రగ్స్ ఫ్రీ సీటీగా మార్చాలని కేసీఆర్ సర్కార్ కంకణం కట్టుకుంది. ఎక్సైజ్, పోలీసు అధికారులతో కేసీఆర్ ఇటీవల కీలక సమావేశం నిర్వహించారు.ఈ సమావేశంలో అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేశారు. ఈ ఆదేశాలతో పోలీసు, ఎక్సైజ్ అధికారలుు నిఘాను మరింత ముమ్మరం చేశారు. హైద్రాబాద్ సీపీగా సీవీ ఆనంద్ బాధ్యతలు చేపట్టిన తర్వాత డ్రగ్స్ సరఫరా చేసే వారి అరెస్ట్ లు పెరిగాయి. ముంబై లో ఉంటూ దేశ వ్యాప్తంగా డ్రగ్స్ సరఫరా చేస్తున్న టోనిని హైద్రాబాద్ పోలీసులు అరెస్ట్ చేశారు. టోనితో పాటు టోని నుండి డ్రగ్స్ కొనుగోలు చేసిన వ్యాపారులను కూడా పోలీసులు అరెస్ట్ చేశారు.డ్రగ్స్ తో పాటు గంజాయిని సరఫరా చేస్తున్న వారిపై ఉక్కుపాదం మోపారు పోలీసులు..