రాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్డీఏ అభ్యర్ధి ద్రౌపది ముర్ముకు మద్దతివ్వాలని టీడీపీ నిర్ణయం తీసుకుంది. సోమవారం నాడు జరిగిన టీడీపీ స్ట్రాటజీ కమిటీ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు.
అమరావతి: రాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్డీఏ అభ్యర్ధి Draupadi Murmu కు మద్దతివ్వాలని TDP నిర్ణయం తీసుకుంది. సోమవారం నాడు జరిగిన టీడీపీ స్ట్రాటజీ కమిటీ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకుంది. Presidential Electionలో ఎన్డీఏ అభ్యర్ధిగా ద్రౌపది ముర్ము బరిలో దిగింది. విపక్ష పార్టీల తరపున మాజీ కేంద్ర మంత్రి Yashwant Sinha పోటీ చేస్తున్నారు.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అధికారంలో ఉన్న వైసీపీ కూడా ద్రౌపది ముర్ముకు మద్దతును ప్రకటించింది. ద్రౌపది ముర్ము నామినేషన్ కార్యక్రమంలో ఆ పార్టీ ఎంపీ విజయసాయిరెడ్డి కూడా పాల్గొన్నారు. రాష్ట్రపతి ఎన్నికల్లో విపక్ష పార్టీల తరపున యశ్వంత్ సిన్హాను బరిలోకి దింపారు.
రాష్ట్రపతి ఎన్నికల్లో బరిలో ఉన్న ద్రౌపది ముర్ము ఈ నెల 12న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పర్యటించనున్నారు.తనకు మద్దతు ప్రకటించిన వైసీపీ ప్రజా ప్రతినిధులతో ఆమె భేటీ కానున్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ముర్ము పర్యటనకు ఒక్క రోజు ముందే టీడీపీ తన నిర్ణయాన్ని ప్రకటించారు. దీంతో ఏపీ టూర్ కు వస్తున్న ముర్ము టీడీపీకి చెందిన ప్రజా ప్రతినిధులతో కూడా సమావేశం అయ్యే అవకాశం లేకపోలేదు.
గతంలో టీడీపీ ఎన్డీఏలో భాగస్వామిగా ఉంది. ఆ సమయంలో రామ్ నాథ్ కోవింద్ ను బరిలోకి దింపింది ఎన్డీఏ.ఆ సమయంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విపక్షంలో ఉన్న వైసీపీ రామ్ నాథ్ కోవింద్ కు మద్దతును ప్రకటించింది. ఆ సమయంలో ప్రధాని నరేంద్ర మోడీతో భేటీ అయిన వైఎస్ జగన్ రాష్ట్రపతి అభ్యర్థి రామ్ నాథ్ కోవింద్ కు మద్దతు ప్రకటించిన విషయం తెలిసిందే.ఈ దఫా కూడా ఎన్డీఏ అభ్యర్ధికే వైసీపీ తన మద్దతును ప్రకటించింది. అయితే ద్రౌపది ముర్ముకు మద్దతు విషయాన్ని ప్రకటించడంలో టీడీపీ ఆలస్యం చేసింది.
ఏపీ రాష్ట్రంలో వైసీపీకి 151 ఎమ్మెల్యేలు, పార్లమెంట్ లో 22 ఎంపీల బలం ఉంది. రాష్ట్రపతి ఎన్నికల కోసం ఏర్పాటు చేసే ఎలక్టోరల్ కాలేజీలో వైఎస్ఆర్‌సీపీకి ఉన్న ఓట్ల విలువ 43,674 గా ఉంది. ఎలక్టోరల్ కాలేజీలో వైఎస్ఆర్‌సీపీ ఓట్ షేర్ విలువ 4 శాతంగా ఉంది.
టీడీపీకి ఏపీ అసెంబ్లీలో 23 మంది ఎమ్మెల్యేలు, పార్లమెంట్ లో ముగ్గురు ఎంపీలున్నారు. అయితే కొందరు ఎమ్మెల్యేలు వైఎస్ఆర్‌సీపీకి మద్దతు పలికారు.ఈ ఎన్నికల్లో పార్టీ విప్ కూడా చెల్లదు. వైఎస్ఆర్‌సీకి మద్దతు నిలిచిన అభ్యర్ధులు కూడా ఎన్డీఏ అభ్యర్ధికే మద్దతుగా నిలిచే అవకాశం ఉంది.
2012 లో అప్పటి యూపీఏ ప్రభుత్వం రాష్ట్రపతి అభ్యర్ధిగా ప్రణబ్ ముఖర్జీని బరిలోకి దింపింది. ఉపరాష్ట్రపతి పదవికి హామీద్ అన్సారీని బరిలోకి దింపింది. ఈ ఎన్నికల్లో వైసీపీ ప్రణబ్ ముఖర్జీకి, హామీద్ అన్సారీకి మద్దతిచ్చిన విషయం తెలిసిందే.
also read:పవన్ కళ్యాణ్‌ది వీకెండ్ ప్రజాసేవ.. రాజకీయాలకు కూడా ఆలస్యమే: పేర్ని నాని సెటైర్లు
2019 ఎన్నికలకు కొన్ని రోజుల ముందు ప్రత్యేక హోదా విషయమై ఎన్డీఏతో టీడీపీ తెగదెంపులు చేసుకుంది. ఎన్డీఏ సర్కార్ పై టీడీపీ అవిశ్వాసం కూడా ప్రవేశపెట్టింది. ఆ తర్వాత జరిగిన ఎన్నికల్లో టీడీపీ ఏపీలో ఓటమి పాలైంది. వైసీపీ ఘన విజయం సాధించింది. కేంద్రంలో మరోసారి మోడీ నేతృత్వంలో బీజేపీ సర్కార్ ఏర్పాటైంది. 2014 కంటే 2019లో మోడీ అధిక సీట్లతో కేంద్రంలో ప్రభుత్వం ఏర్పాటు చేశారు.