అప్పటి వరకు టెండర్లొద్దు: ప్రభుత్వ ఆస్తుల అమ్మకాలపై ఏపీ హైకోర్టు

By narsimha lode  |  First Published Jul 30, 2020, 3:30 PM IST

మిషన్ బిల్డ్, ప్రభుత్వ ఆస్తుల అమ్మకాలపై మధ్యంతర ఉత్తర్వులను కొనసాగిస్తున్నట్టుగా ఏపీ హైకోర్టు స్పష్టం చేసింది. తుది తీర్పు వచ్చేవరకు టెండర్లు ఖరారు చేయవద్దని  గురువారం నాడు ఏపీ హైకోర్టు ఆదేశించింది.



అమరావతి: మిషన్ బిల్డ్, ప్రభుత్వ ఆస్తుల అమ్మకాలపై మధ్యంతర ఉత్తర్వులను కొనసాగిస్తున్నట్టుగా ఏపీ హైకోర్టు స్పష్టం చేసింది. తుది తీర్పు వచ్చేవరకు టెండర్లు ఖరారు చేయవద్దని  గురువారం నాడు ఏపీ హైకోర్టు ఆదేశించింది.

మిషన్ బిల్డ్, ప్రభుత్వ ఆస్తుల అమ్మకాలను నిరసిస్తూ గుంటూరుకు చెందిన సురేష్ బాబు సహా పలువురు దాఖలు చేసిన పిటిషన్లపై ఏపీ హైకోర్టు ఇవాళ విచారణ నిర్వహించింది.  కౌంటర్ దాఖలు చేసేందుకు సమయం కావాలని ప్రతివాదులు కోరారు.  అయితే ప్రతివాదులంతా కౌంటర్ దాఖలు చేయాలని హైకోర్టు ఆదేశించింది.

Latest Videos

also read:రాజ్యమే శాశ్వతం, ప్రభుత్వం కాదు: ప్రభుత్వ ఆస్తుల విక్రయాలపై ఏపీ హైకోర్టు కీలక వ్యాఖ్యలు

గతంలో ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులను కొనసాగిస్తూ కొర్టు ఉత్తర్వులు జారీ చేసింది. తుది తీర్పు వచ్చేవరకు టెండర్లు ఖరారు చేయవద్దని హైకోర్టు ఆదేశించిన విషయం తెలిసిందే. ఈ కేసు విచారణను నాలుగు వారాల పాటు వాయిదా వేసింది హైకోర్టు.

ఆదాయం కోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రభుత్వ భూములను విక్రయించాలని నిర్ణయం తీసుకొంది. ఈ మేరకు ఏపీ బిల్డ్  మిషన్ ను ఏర్పాటు చేసింది. అయితే ప్రభుత్వ భూముల విక్రయించాలని జగన్ సర్కార్ తీసుకొన్న నిర్ణయాన్ని విపక్షాలు విమర్శించాయి.

click me!