విజయవాడ గ్యాంగ్‌వార్: పనిచేయని పండూ చేతివేలు, న్యూరో జర్జరీ విభాగంలో పరీక్షలు

By narsimha lode  |  First Published Jun 9, 2020, 3:53 PM IST

గ్యాంగ్‌వార్‌లో గాయపడిన పండుకు మంగళవారంనాడు మరోసారి వైద్యులు పరీక్షలు నిర్వహించారు. ఇరువర్గాల దాడిలో సందీప్ వర్గీయుల దాడిలో గాయపడడంతో చేతి వేలు పనిచేయడం లేదని చెప్పడంతో వైద్యులు పరీక్షించారు.
 


గుంటూరు: గ్యాంగ్‌వార్‌లో గాయపడిన పండుకు మంగళవారంనాడు మరోసారి వైద్యులు పరీక్షలు నిర్వహించారు. ఇరువర్గాల దాడిలో సందీప్ వర్గీయుల దాడిలో గాయపడడంతో చేతి వేలు పనిచేయడం లేదని చెప్పడంతో వైద్యులు పరీక్షించారు.

also read:బెజవాడ గ్యాంగ్ వార్ లో బిటెక్, ఎంబిఎ యువకులు... నిందితుల పూర్తి వివరాలివే

Latest Videos

గుంటూరులోని జీజీహెచ్ ఆసుపత్రిలో పండుకు చికిత్స అందిస్తున్నారు. గత నెల 30వ తేదీన విజయవాడ తోటవారి సందులో సందీప్, పండు గ్యాంగ్‌ల మధ్య ఘర్షణ చోటు చేసుకొంది.ఈ ఘర్షణలో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ సందీప్ గత నెల 31వ తేదీన మరణించాడు.

also read:బెజవాడ గ్యాంగ్ వార్: పండు ముఠా దాడిలోనే సందీప్ మృతి, అరెస్టయిన 13 మంది వీరే...

ఘర్షణ జరిగిన రోజు నుండి పండు గుంటూరు ఆసుపత్రిలోనే చికిత్స పొందుతున్నాడు. ఇవాలో రేపో పండును ఆసుపత్రి నుండి డిశ్చార్జ్ చేసే అవకాశం ఉన్నట్టుగా ప్రచారం సాగింది. సందీప్ గ్యాంగ్ తో గొడవ  జరిగిన నాటి నుండి ఓ చేతి వేలు పనిచేయడం లేదని పండు వైద్యులకు చెప్పారు. దీంతో జీజీహెచ్ ఆసుపత్రిలోని న్యూరో సర్జరీ విభాగంలో పండుకు పరీక్షలు నిర్వహించారు.

న్యూరో సర్జరీ విభాగానికి పండును పటిష్టమైన బందోబస్తు మధ్య తీసుకెళ్లారు. న్యూరో సర్జరీ విభాగంలో పరీక్షలు నిర్వహించిన తర్వాత ఆయన రూమ్ కు తీసుకెళ్లారు.
ఈ ఆసుపత్రిలో పండు ఉన్నందున ఆసుపత్రి వద్ద భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. పండు ఇదే ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నందున సామాన్య రోగులకు ఇబ్బందులు ఏర్పడుతున్నాయని కూడ స్థానికులు ఆరోపిస్తున్నారు.
 

click me!