స్త్రీ పొట్టలోని బిడ్డను తీశారు.. గుడ్డముక్క పెట్టారు.. నరకం చూపించారు!!

By AN TeluguFirst Published Jul 19, 2021, 9:56 AM IST
Highlights

నంద్యా ప్రభుత్వ జిల్లా ఆస్పత్రిలో నందిని అనే మహిళకు రెండు నెలల కింద ఆపరేషన్ చేయగా పండంటి బిడ్డకు జన్మనిచ్చారు. సిజేరియన్ చేసే సమయంలో ఎప్పటికప్పుడు రక్తం శుభ్రం చేసే గుడ్డ ముక్కను పొరబాను లోపల పెట్టి కుట్లు వేశారు. 

నంద్యాల : ప్రసవ వేదనతో వచ్చిన ఆ మహిళకు ఆపరేషన్ చేసి బిడ్డను బయటకు తీశారు. ఆపరేషన్ చేసిన భాగంలో రెండు నెలలైనా చీము వస్తూనే ఉండటంతో మూడుసార్లు ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చారు. 

అయితే, వైద్యులు పూర్తి స్థాయిలో వైద్యమందించకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించారు. ఫలితంగా ఆ మహిళ నరకయాతన పడింది. చివరకు వైద్యులు స్పందించి.. పరీక్షలు చేసి కడుపులో ఓ గుడ్డముక్క ఉన్నట్లు గుర్తించారు. ఈ ఘటన నంద్యాల ప్రభుత్వ జిల్లా ఆస్పత్రిలో ఆలస్యంగా వెలుగు చూసింది. 

నంద్యా ప్రభుత్వ జిల్లా ఆస్పత్రిలో నందిని అనే మహిళకు రెండు నెలల కింద ఆపరేషన్ చేయగా పండంటి బిడ్డకు జన్మనిచ్చారు. సిజేరియన్ చేసే సమయంలో ఎప్పటికప్పుడు రక్తం శుభ్రం చేసే గుడ్డ ముక్కను పొరబాను లోపల పెట్టి కుట్లు వేశారు. 

ఆ బాలింతకు రెండు నెలలుగా కుట్ల వద్ద చీము కారుతోంది. ఎన్నిసార్లు ఆస్పత్రికి వచ్చినప్పటికీ వైద్యులు మామూలు ఇన్ఫెక్షన్ అని మందులిచ్చి పంపించారు. అయిపన్పటికీ తగ్గలేదు. దీంతో ఆమె ఓ జనరల్ సర్జన్ వద్దకు వెళ్లారు. ఆయన వెంటనే స్కానింగ్ రాసి ఇచ్చారు. చివరికి స్కానింగ్ లో అసలు విషయం బయటపడింది. 

దీంతో కడుపులో గుడ్డ ముక్క ఉందనే విషయాన్ని ఆ డాక్టర్ ఆమెకు చెప్పకుండా ఆపరేషన్ చేసిన గైనిక్ డాక్టర్లకు చెప్పారు. ఈ విషయం బైటికి రానీయకుండా ఆమెకు ఆపరేషన్ చేసేందుకు సిద్ధమయ్యారు. కుట్ల వద్ద కోత పెట్టి రెండించుల మేర ఉన్న గుడ్డముక్కను తొలగించారు. ఏమీ కాదని, వారంలో తగ్గిపోతుందని పంపేశారు.

click me!