Diwali 2023 : దీపావళి సెలవును ప్రభుత్వం నవంబర్ 13వ తేదీకి మారుస్తూ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ఏపీ సీఎస్ జవహర్ రెడ్డి ఉత్తర్వులు కొద్ది సేపటి క్రితమే ఉత్తర్వులు జారీ చేశారు.
Diwali 2023 : దీపావళి (Diwali) సెలవులో కీలక మార్పు చోటు చేసుకుంది. క్యాలెండర్ లో గానీ, ప్రభుత్వం జారీ చేసిన పండగ సెలవుల జాబితాలో గానీ దీపావళి నవంబర్ 12వ తేదీ అని ఉంది. అయితే తాజాగా ఏపీ ప్రభుత్వం దీపావళి సెలవును నవంబర్ 13వ తేదీకి మార్చింది. ఈ మేరకు ప్రభుత్వం కొద్ది సేపటి క్రితమే సెలవు మారుస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.
మహిళా ఆఫీసర్ హత్య కేసులో డ్రైవర్ అరెస్టు.. ఉద్యోగంలో నుంచి తొలగించందుకే దారుణం ?
12వ తేదీన ఉన్న సెలవును 13వ తేదీన సాధారణ సెలవు గా పేర్కొంటూ ఏపీ సీఎస్ జవహర్ రెడ్డి ఉత్తర్వులు విడుదల చేశారు. ఇంతకు ముందు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విడుదల చేసిన లీవ్స్ లిస్టులో నవంబర్ 12వ తేదీన ఆదివారం దీపావళిగా, అదే రోజు సెలువుగా ఉంది. కానీ ఆదివారం ఎలాగూ గవర్నమెంట్ హలీడే కాబట్టి సెలవులో మార్పు చేశారు. ఈ నెల 13వ తేదీ ఆప్షనల్ హాలీడే గా ఉంది. అయితే దానిని ఇప్పుడు సాధారణ సెలవుగా ప్రభుత్వం మార్చింది.