దిశ ఏసీపీ నాయుడి వేధింపులతోనే తాను ఆత్మహత్యకు పాల్పడినట్లు సీపీకి లేఖ రాశారు. ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఆయన లేఖ ద్వారా పలు వివరాలు వెల్లడించారు.
విజయవాడలో దిశ సబ్ ఇన్స్పెక్టర్ ఆత్మహత్యాయత్నం కలకలం రేపిన సంగతి తెలిసిందే. దిశ పోలీస్ స్టేషన్ లో ఎస్సైగా పనిచేస్తున్న విజయ్ కుమార్ తన నివాసంలోనే మంగళవారం ఆత్మహత్యకు పాల్పడ్డారు. నిద్రమాత్రలు మింగి suicide attempt చేశారు. ఇది గమనించిన కుటుంబ సభ్యులు ఆయనను ప్రైవేట్ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. కాగా, ఎస్ఐకి ఎలాంటి ప్రాణాపాయం లేదని వైద్యులు ప్రకటించడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. ఈ ఘటన అనంతరం ప్రమాదం నుంచి బయటపడిన ఎస్ఐ స్పందించారు.
దిశ ఏసీపీ నాయుడి వేధింపులతోనే తాను ఆత్మహత్యకు పాల్పడినట్లు సీపీకి లేఖ రాశారు. ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఆయన లేఖ ద్వారా పలు వివరాలు వెల్లడించారు. దిశ ఏసిపి నాయుడు harassment కారణంతోనే ఆత్మహత్యకు పాల్పడినట్లు తెలిపారు. ACP Naidu పెట్టే బాధలు భరించలేక చనిపోవడానికి సిద్ధపడినట్లు పేర్కొన్నారు.
undefined
నిజమైన కేసును తప్పుడు కేసుగా తనతో చేయిస్తున్నారని.. తాను ప్రశ్నించినందుకు తనపై కక్షపూరితంగా వ్యవహరిస్తున్నారని తెలిపారు. కష్టపడి పనిచేస్తున్నా ఇబ్బందులకు గురి చేస్తున్నారని పేర్కొన్నారు. ఏసీపీ పెట్టే బాధలు భరించలేక ఆత్మహత్యకు యత్నించినట్లు ఎస్సై లేఖలో పేర్కొన్నారు. కాగా
Vijayawada Police Departmentలో ఈ ఘటన కలకలం రేపింది.
Heavy rains: ఏపీలో భారీ వర్షాలు.. నెల్లూరు జిల్లాల్లో పాఠశాలలకు సెలవు, కంట్రోల్ రూమ్ ఏర్పాటు..
అయితే, ఓ కేసులో నిందితుడిగా ఉన్న Transco Constable నవకాంత్ ను తప్పించాలని తనమీద ఒత్తిడి తెచ్చారన్న ఎస్సై.. అతడి ఎదుట అవమానకరంగా మాట్లాడినట్లు మాచవరం పోలీసులకు తెలిపారు. నవకాంత్ ను కేసు నుంచి తొలగించినట్లు రాయించి సంతకాలు పెట్టిస్తానని భయపెట్టడంతో నిద్ర మాత్రలు మింగినట్లు విజయ్ కుమార్ తెలిపారు.
వివరాలు నమోదు చేసుకున్న అధికారులు.. దిశ పోలీస్ స్టేషన్లో ఆత్మహత్యాయత్నం జరగడంతో కేసును గవర్నర్ పేట పోలీసులకు బదిలీ చేశారు. ఈ కేసులో పూర్తి వివరాలు రాబట్టేందుకు శాఖాపరమైన దర్యాప్తునకు సీపీ శ్రీనివాసులు ఆదేశించారు. ఏడీసీపీ 1ఎం.ఆర్. కృష్ణంరాజును దర్యాప్తు అధికారిగా నియమించారు.
పీఆర్సీ: రేపు ఉద్యోగులతో జగన్ సర్కార్ జాయింట్ కౌన్సిల్ సమావేశం
కాగా, నవంబర్ 9న విజయవాడలో ఒక సబ్ ఇన్స్ పెక్టర్ ఆత్మహత్యాయత్నం కలకలం రేపింది. దిశ పోలీస్ స్టేషన్ లో పనిచేస్తున్న ఆయన తన నివాసంలోనే ఆత్మహత్యకు పాల్పడ్డారు.
విజయవాడ దిశ పోలీస్ స్టేషన్ లో పనిచేస్తున్న ఆయన నిద్రమాత్రలు మించి ఆత్మహత్యకు యత్నించారు. కుటుంబసభ్యులు సకాలంలో గమనించి వెంటనే హుటాహుటిన ఆస్పత్రికి తరలించడంతో ప్రమాదం నుంచి బయటపడ్డారు. కాగా ఆ సమయంలో ఆత్మహత్యకు కారణాలు ఏంటనేది తెలియలేదు. వేదింపులా? వేరే కారణాలా? ఎందుకు ఇలా చేయాల్సి వచ్చిందన్న దానికి ఈ రోజు సమాధానం దొరికింది.