గతంలో మంత్రి విడుదల రజినికి మర్రి రాజశేఖర్ కు అనేక సార్లు చిలకలూరిపేటలో గొడవలు జరిగిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఇరు వర్గలు ఒకరిపై, మరొకరు కేసులు పెట్టుకున్నారు.
గుంటూరు : ఆంధ్రప్రదేశ్ లోని అధికార వైసీపీలో గుంటూరు వేదికగా మరోసారి విభేదాలు తెరమీదకి వచ్చాయి. నేడు గుంటూరులో ఆరోగ్యశాఖ మంత్రి విడదల రజిని పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించారు. ఇటీవలె ఆమెను గుంటూరు పార్టీ ఇంచార్జ్ గా నియమించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో కార్యాలయ ప్రారంబోత్సవానికి రీజనల్ కోఆర్డినేటర్ మర్రి రాజశేఖర్ హాజరు కాలేదు.
మర్రి రాజశేఖర్ గుంటూరు, కృష్ణ, ఎన్టీఆర్ జిల్లాలకి రిజనల్ కోర్డినేటర్ ఉన్నారు. అయితే, కార్యాలయం వద్ద ప్రారంభోత్సవం సందర్భంగా ఏర్పాటు చేసిన బోర్డు,ఫ్లెక్సీలో మర్రి రాజశేఖర్ ఫొటో కనిపించలేదు. అయితే, గతంలో మంత్రి విడుదల రజినికి మర్రి రాజశేఖర్ కు అనేక సార్లు చిలకలూరిపేటలో గొడవలు జరిగిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఇరు వర్గలు ఒకరిపై, మరొకరు కేసులు పెట్టుకున్నారు.
ఆపరేషన్ కాపు: ముద్రగడ, వంగవీటి రాధాలకు జగన్ గాలం
అప్పటిలో రజిని ,మర్రి గొడవల కారణంగా పలనాడు జిల్లాకి పార్టీ అధిష్ఠానం మరొకరిని రీజనల్ కో ఆర్డినేటర్ ని నియమించింది. ఇప్పుడు గుంటూరు పశ్చిమానికి విడుదల రజినిని ఇంచార్జిగా నియమించింది. గుంటూరు ,కృష్ణ,ఎన్టీఆర్ జిల్లాలకి మర్రి రాజశేకర్,అళ్ల అయోధ్య రామిరెడ్డిలు ఇద్దరు రీజనల్ కోఆర్డినేటర్స్ ఉన్నారు. కానీ, ఇద్దరు రీజనల్ కోరినేటర్స్ ఉండగా రజిని అనుచరులు కార్యాలయ ప్రారంభానికి ఒకరి ఫోటో వేశారు.
అయోధ్య రామిరెడ్డి ఫోటో వేసి, మర్రి రాజశేఖర్ ఫొటో వేయలేదు. దీంతో కార్యాలయ ప్రారంభనికి రాని అయోధ్య రామిరెడ్డి, మర్రి రాజశేఖర్ ఇద్దరూ రాలేదు. దీంతో వర్గవిబేధాలు మరోసారి గుప్పుమన్నట్టు అయ్యింది.
ఇదిలా ఉండగా, కొత్త సంవత్సర వేడుకల్లో అపశృతి చోటు చేసుకుంది. ఆదివారం అర్ధరాత్రి గుంటూరులో మంత్రి విడుదల రజని ఆఫీసు ముందు ఉద్రిక్తత నెలకొంది. ఆంధ్రప్రదేశ్ వైద్యారోగ్య శాఖ మంత్రి విడుదల రజని విద్యానగర్లో కొత్తగా ప్రారంభించబోయే పార్టీ ఆఫీసుపై టిడిపి-జనసేన కార్యకర్తలు రాళ్ల దాడి చేశారు. ఈ దాడిలో ఆఫీసులోని అద్దాలు ధ్వంసం అయ్యాయి. న్యూ ఇయర్ వేడుకల్లో భాగంగా టిడిపి-జనసేన కార్యకర్తలు అటు నుంచి ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీ సమయంలో కొంతమంది రజిని ఆఫీసుపై రాళ్లతో దాడికి దిగారు. సమాచారం అందడంతో అక్కడికి చేరుకున్న పోలీసులు వెంటనే లాఠీచార్జి చేసి వారిని చెదరగొట్టారు.
దాడికి పాల్పడ్డ కొంతమంది టిడిపి-జనసేన కార్యకర్తలను అదుపులోకి తీసుకున్నారు. దీనిమీద విడుదల రజని స్పందిస్తూ.. కావాలనే ఈ దాడికి దిగినట్లుగా తెలుస్తుందని అన్నారు. దానికి పాల్పడ్డవారు ఎవరైనా సరే వదిలేది లేదన్నారు. అద్దాలు పగలగొట్టిన రాళ్లను చూపిస్తూ ఇంత పెద్ద రాళ్ళు ఎక్కడినుండి వస్తాయంటూ ప్రశ్నించారు. ముందుగానే పకడ్బందీగా దాడి చేయాలని ఉద్దేశంతోనే వచ్చారని చెప్పుకొచ్చారు. ఉద్రిక్తతల నేపథ్యంలో మంత్రి విడుదల రజని కార్యాలయం దగ్గర భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.
గుంటూరు పశ్చిమ నియోజకవర్గ వైసిపి ఇన్చార్జిగా ఇటీవలే మంత్రి విడుదల రజిని నియమితులయ్యారు. నూతన సంవత్సరం సందర్భంగా విడుదల రజని కొత్త ఆఫీసు ప్రారంభోత్సవానికి ఏర్పాట్లు చేసుకున్నారు. ఈ రోజు ఉదయం 10 గంటలకు పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించాల్సి ఉంది. ఈ కార్యాలయానికి దగ్గరలోనే ఉన్న ఎన్టీఆర్ విగ్రహానికి టిడిపి - జనసేన కార్యకర్తలు పాలాభిషేకం చేశారు. ఆ తరువాత ర్యాలీ తీసిన సందర్భంలో ఈ ఘటన చోటు చేసుకుంది.