ఏపీ శాసనసభ.. టీడీపీ, బీజేపీ మాటల యుద్ధం

By ramya neerukondaFirst Published Sep 10, 2018, 11:08 AM IST
Highlights

సెంబ్లీ ప్రశ్నోత్తరాల సమయంలో నరేగా పనులపై బీజేపీ ఎమ్మెల్యే మాణిక్యాలరావు మాట్లాడుతూ నరేగా పనుల్లో రాష్ట్రం అగ్రస్థానంలో ఉందన్నారు. మంత్రి లోకేష్‌ నిజాయితీగా పనిచేస్తున్నారని కితాబిచ్చారు. గ్రామాల్లో రహదారులను అభివృద్ధి చేస్తున్నారన్నారు. 

ఏపీ శాసన సభ సమావేశాలు కొనసాగుతున్నాయి. ఈ సమావేశాలను వైసీపీ బహిష్కరించిన సంగతి తెలిసిందే. కాగా.. టీడీపీ, బిజేపీ ఎమ్మెల్యేలు ఈ సమావేశాలకు హాజరయ్యారు. ప్రశ్నోత్తరాల సమయంలో అధికార పార్టీ ఎమ్మెల్యేలే ప్రతిపక్ష నేతలు గా కూడా వ్యవహరిస్తున్నారు.

ఇదిలా ఉంటే.. ఈ రోజు సభలో నరేగా నిధుల వ్యవహారంపై బీజేపీ, టీడీపీ సభ్యుల మధ్య  వాగ్వాదం చోటు చేసుకుంది. అసెంబ్లీ ప్రశ్నోత్తరాల సమయంలో నరేగా పనులపై బీజేపీ ఎమ్మెల్యే మాణిక్యాలరావు మాట్లాడుతూ నరేగా పనుల్లో రాష్ట్రం అగ్రస్థానంలో ఉందన్నారు. మంత్రి లోకేష్‌ నిజాయితీగా పనిచేస్తున్నారని కితాబిచ్చారు. గ్రామాల్లో రహదారులను అభివృద్ధి చేస్తున్నారన్నారు. 

అయితే నరేగా నిధులను పుష్కలంగా ఇస్తున్న కేంద్రానికి కృతజ్ఞతలు తెలపాలని మాణిక్యాలరావు డిమాండ్ చేశారు. దీనిపై మంత్రి లోకేష్ స్పందిస్తూ నరేగా నిధులను దుర్వినియోగం చేస్తున్నారని కేంద్రానికి బీజేపీ, వైసీపీ ఎమ్మెల్యేలు లేఖలు రాస్తున్నారని మండిపడ్డారు. రాష్ట్రానికి కేంద్రం ఆడిట్‌ బృందాలను పంపిందని, పూర్తి పారదర్శకంగా పనులు జరుగుతున్నాయని ఆడిట్‌ బృందాలు కేంద్రానికి తెలిపాయన్నారు. పనులు చేస్తేనే నిధులు వస్తాయన్న విషయం తెలుసుకోవాలని లోకేష్ హితవు పలికారు.

click me!