పవన్ కల్యాణ్ ను చంద్రబాబు మెల్లిగా సైడ్ చేస్తున్నాారా..?

By Arun Kumar P  |  First Published Jul 10, 2024, 8:50 PM IST

ఎన్నికల ఫలితాల తర్వాత పవన్ కల్యాణ్ ను ఆకాశానికి ఎత్తిన చంద్రబాబే ఇప్పుడు ఆయనను దూరం పెడుతున్నారా..? ఇటీవల చంద్రబాబు తీరును చూసినవారు ఇదే అనుమానం వ్యక్తం చేస్తున్నారు. 


అమరావతి : ఆంధ్ర ప్రదేశ్ ఎన్నికల ఫలితాల తర్వాత గట్టిగా వినిపించిన పేరు పవన్ కల్యాణ్. గత అసెంబ్లీ ఎన్నికల్లో కేవలం ఒకేఒక్క సీటు గెలిచిన జనసేన పార్టీని ఈసారి పోటీచేసిన అన్ని సీట్లలో గెలిచే స్థాయికి తీసుకువచ్చారు. అంతేకాదు తెలుగుదేశం, జనసేన, బిజెపి కూటమి ఏర్పాటులోనూ పవన్ దే కీలక పాత్ర. కూటమి ఏర్పాటే జరగకుంటే వైసిపిని ఓడించడం సాధ్యమయ్యేది కాదనే వాదన కూడా వుంది. ఇలా వైసిపిని ఓడించడంలో... కూటమిని గెలిపించడంతో పవన్ కీలకంగా వ్యవహరించారు. ఇలా ఇంతకాలం సినిమాల్లో పవర్ స్టార్ గా నిరూపించుకున్న పవన్ ఏపీ ఎన్నికల ఫలితాలు వెలువడ్డాక రాజకీయాల్లోనూ పవర్ ఫుల్ గా మారారు. 

కూటమి గెలుపులో కీలకంగా వ్యవహరించిన పవన్ కు ప్రభుత్వంలోనూ కీలకంగా మారారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తర్వాతి స్థానం ఆయనకే దక్కింది.... డిప్యూటీ సీఎంతో పాటు కీలకమైన పంచాయితీరాజ్, గ్రామీణాభివృద్ది శాఖలు దక్కాయి. చంద్రబాబు కేబినెట్ లో పవన్ తో పాటు మరో ఇద్దరు జనసేన ఎమ్మెల్యేలకు చోటు దక్కింది. అసెంబ్లీ సమావేశాలు, ఇతక కార్యక్రమాల్లోనూ పవన్ కు చంద్రబాబు తగిన ప్రాధాన్యత కల్పించారు. ఇంతవరకు అంతా బాగానే వుంది. కానీ ప్రస్తుతం చంద్రబాబు వెంట పవన్ కనిపించడం లేదు... ఎక్కడికి వెళ్లినా చంద్రబాబు ఒక్కరే వెళుతున్నారు. ఇదే ఇప్పుడు పలు అనుమానాలను రెకె్త్తిస్తోంది... పవన్ ను చంద్రబాబు పక్కనబెట్టేసారనే ప్రచారం ప్రారంభమయ్యింది. 

Latest Videos

పవన్ ను చంద్రబాబు దూరం పెట్టారనడానికి కారణాలివే : 

తెలంగాణ రాజధాని హైదరాబాద్ లో ఇటీవల తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులిద్దరూ భేటీ అయ్యారు. ఉమ్మడి రాష్ట్ర విభజన జరిగి పదేళ్లు అవుతున్నా ఇంకా ఇరురాష్ట్రాల మధ్య కొన్ని సమస్యలు పరిష్కారం కాలేదు... వాటిపై చర్చించేందుకు ఇద్దరు సీఎంల సమావేశం జరిగింది. అయితే ఈ సమావేశంలో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క కూడా పాల్గోన్నారు. కానీ ఆంధ్ర ప్రదేశ్ నుండి సీఎం చంద్రబాబు నాయుడు, ఇతర మంత్రులు పాల్గొన్నారు... డిప్యూటీ సీఎం పవన్ పాల్గొనలేదు. ఇది పవన్ ను చంద్రబాబు పక్కనబెట్టారంటూ ప్రచారానికి దారితీసింది. 

ఇక ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత చంద్రబాబు నాయుడు మొదటిసారి దేశ రాజధాని డిల్లీకి వెళ్ళారు. ప్రధాని నరేంద్ర మోదీ, హోంమంత్రి అమిత్ షా లతో పాటు మరికొందరు కేంద్ర మంత్రులను కలిసారు. రాష్ట్రానికి కావాల్సిన నిధులు, పాలనలో సహకారం గురించి కేంద్రాన్ని కోరారు. ఇలా చంద్రబాబు చేపట్టిన డిల్లీ పర్యటనలో కూడా పవన్ కల్యాణ్ లేకపోవడం కూడా తాజా ప్రచారానికి ఓ కారణం. 

ఇక కూటమి ప్రభుత్వ ఏర్పాటుతర్వాత ఎన్నికల హామీ మేరకు పింఛన్లను పెంచారు. జూలై 1న పెంచిన పింఛన్లను అర్హులైన అందరికీ అందజేసారు. ఇలా ఒకేరోజు పెద్దఎత్తును పింఛన్ల పంపిణీ జోరుగా సాగింది. అయితే ఇంత పెద్ద కార్యక్రమానికి సంబంధించిన యాడ్ లో కూడా చంద్రబాబు నాయుడు ఒక్కరే కనిపించారు. డిప్యూటీ సీఎం పవన్ కు ఎక్కడా కనిపించలేదు.

ఈ మూడు సంఘటనలే పవన్ ను చంద్రబాబు పక్కనబెట్టేసారు అనే ప్రచారానికి కారణం అయ్యాయి. ఈ క్రమంలోనూ అసలు పవన్ ను చంద్రబాబు పక్కనబెట్టాల్సిన అవసరమేంటి..? పవన్ చరిష్మాను వాడుకుంటే చంద్రబాబుకే మంచిది కదా.. అనేది మరికొందరి వాదన. ప్రచారం చేస్తున్నవారి వద్ద ఇందుకూ  ఓ సమాధానం రెడీగా వుంది. 

చంద్రబాబుకు వయసు మీదపడుతోంది... వచ్చే ఎన్నికల నాటికి ఆయన వయసు మరింత పెరుగుతుంది. కాబట్టి ఇప్పటినుండే తన వారసుడు నారా లోకేష్ ను ముఖ్యమంత్రి పదవికి సంసిద్దం చేసే పనిలో చంద్రబాబు వున్నారట. కానీ ఇందుకు పవన్ కల్యాణ్ అడ్డుగా వున్నారని భావిస్తున్న చంద్రబాబు ఎన్నికల ఫలితాల తర్వాత పవన్ కు వచ్చిన హైప్ ను తగ్గించే పనిలో పడ్డారట. పవన్ తగ్గిస్తేనే తన కొడుకును పెంచవచ్చనేది చంద్రబాబు అభిప్రాయమట. అందువల్లే కీలక కార్యక్రమాల్లో పవన్ ను చంద్రబాబు పక్కనబెటుతున్నట్లు ప్రచారం జరుగుతోంది. 

click me!