ఉత్తరాంధ్రపై జగన్‌కు ఎందుకంత కోపం: దేవినేని ఉమ

By narsimha lodeFirst Published Jun 29, 2019, 11:34 AM IST
Highlights

ఉత్తరాంధ్రపై ఏపీ సీఎం వైఎస్ జగన్‌కు ఎందుకంత కోపమో చెప్పాలని  మాజీ మంత్రి  దేవినేని ఉమ మహేశ్వరరావు కోరారు.

విజయవాడ: ఉత్తరాంధ్రపై ఏపీ సీఎం వైఎస్ జగన్‌కు ఎందుకంత కోపమో చెప్పాలని  మాజీ మంత్రి  దేవినేని ఉమ మహేశ్వరరావు కోరారు.

శనివారం నాడు ఆయన విజయవాడలో మీడియాతో మాట్లాడారు. ఉత్తరాంధ్ర ప్రాజెక్టు పనులను ఎందుకు నిలిపివేశారో చెప్పాలన్నారు. బహుదా- వంశధార అనుసంధానం పనులను నిలిపివేశారన్నారు. తోటపల్లి గురించి ఇద్దరు సీఎంల సమావేశంలో ఎందుకు మాట్లాడలేదని ఆయన ప్రశ్నించారు.

ఉత్తరాంధ్ర సుజల స్రవంతి ప్రాజెక్టు పనులు నిలిపివేశారని  ఆయన గుర్తు చేశారు. వైకుంఠపురం బ్యారేజీ పనులు కూడ నిలిపివేసినట్టుగా ఆయన ప్రస్తావించారు. ఈ ప్రాజెక్టు పనుల నిలిపివేత గురించి జగన్ మౌనంగా ఉండడం సరైంది కాదన్నారు. గోదావరి- పెన్నా నదుల అనుసంధానం పనులు నిలిచిపోయాయని చెప్పారు.

512 టీఎంసీల నికర జలాలపై ఏపీ హక్కులను కాపాడుకోవాల్సిన అవసరం ఉందని దేవేనేని ఉమ ఏపీ సీఎం జగన్‌కు సూచించారు.

click me!