దెందులూరు అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు 2024

By Arun Kumar PFirst Published Mar 19, 2024, 8:55 PM IST
Highlights

ఏలూరు జిల్లాలో ఆసక్తికర రాజకీయ పరిణామాలు చోటుచేసుకునే నియోజకవర్గాల్లో దెందులూరు ఒకటి. మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ వివాదాలతో ఈ నియోజకవర్గ పేరు కూడా రాష్ట్రంలో పాపులర్ అయ్యింది.  ప్రస్తుతం ఈ అసెంబ్లీ ఎమ్మెల్యేగా అబ్బయ్య చౌదరి కొనసాగుతున్నారు.  చింతమనేని వర్సెస్ అబ్బయ్య చౌదరి గా 2024 పొలిటికల్ పోరు సాగడంతో ఈసారి ఎన్నికల ఫలితాలపై ఉత్కంఠ నెలకొంది. 

దెందులూరు రాజకీయాలు : 

దెందులూరు అసెంబ్లీ... ఈ పేరు వినగానే ముందుగా గుర్తుకువచ్చేది మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్. టిడిపి అధికారంలో వుండగానే సిట్టింగ్ ఎమ్మెల్యేగా వున్న ఆయనపై  పోలీస్ కేసులు నమోదయ్యాయంటేనే ఆయనెంత వివాదాస్పద నాయకుడో అర్థమవుతుంది. ఇక మహిళా ఎమ్మార్వో వనజాక్షిపై దాడి రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఇలా నిత్యం ఏదో వివాదం సృష్టిస్తూ తానుమాత్రమే కాదు దెందులూరు నియోజకవర్గాన్ని వార్తల్లో వుంచేవారు చింతమనేని.  

ఇదిలావుంటే దెందులూరు నుండి చింతమనేని ప్రభాకర్ వరుసగా రెండుసార్లు (2009, 2014)ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహించారు. అయితే 2019లో హ్యాట్రిక్ కొట్టాలన్న అతడి ఆశలపై వైసిపి నీళ్లుచల్లింది. వైసిపి జోరు రాష్ట్రవ్యాప్తంగానే కాదు దెందులూరులో కూడా కొనసాగి అబ్బయ్య చౌదరి ఎమ్మెల్యేగా గెలిచారు. 

దెందులూరు నియోజకవర్గ పరిధిలోని మండలాలు : 

1. పెదవేగి
2. పెదపాడు
3.  దెందులూరు
4.   ఏలూరు (కొంత భాగం)

దెందులూరు అసెంబ్లీ ఓటర్లు : 

నియోజకవర్గంలో మొత్తం ఓటర్ల సంఖ్య (2019 ఎన్నికల ప్రకారం) - 2,20,361
పురుషులు -  1,08,374
మహిళలు ‌-   1,11,978

దెందులూరు అసెంబ్లీ ఎన్నికలు 2024 అభ్యర్థులు : 

వైసిపి అభ్యర్థి :

గత అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించిన సిట్టింగ్ ఎమ్మెల్యే కొఠారు అబ్బయ్య చౌదరికే మళ్లీ దెందులూరు టికెట్ దక్కింది. చాలా నియోజకవర్గాల్లో సిట్టింగ్ లను మార్చిన వైసిపి అధినేత దెందులూరులో మాత్రం అలాంటి ప్రయోగం చేయలేదు. అబ్బయ్య చౌదరినే చింతమనేని బరిలోకి దింపారు. 

టిడిపి అభ్యర్థి : 

తెలుగుదేశం పార్టీ కూడా మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ ను దెందులూరు బరిలో నిలిపింది. ఆయన గత అసెంబ్లీ ఎన్నికల్లో ఓడినా, ఆనేక వివాదాలు చుట్టుముట్టినా టిడిపి అధినేత చంద్రబాబు మాత్రం చింతమనేనిపై నమ్మకం వుంచారు. 

దెందులూరు అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు :

దెందులూరు అసెంబ్లీ ఎన్నికలు 2019 ఫలితాలు : 

నియోజకవర్గంలో పోలయిన మొత్తం ఓట్లు - 1,86,989  

వైసిపి - కొఠారి అబ్బయ్య చౌదరి - 95,000 ఓట్లు (51 శాతం) - 16,131 ఓట్ల మెజారిటీతో విజయం 

టిడిపి - చింతమనేని ప్రభాకర్ - 78,683 (42 శాతం) - ఓటమి

దెందులూరు అసెంబ్లీ ఎన్నికలు 2014 ఫలితాలు :

నియోజకవర్గంలో పోలయిన మొత్తం ఓట్లు -   1,71,791 (86 శాతం)

టిడిపి - చితమనేని ప్రభాకర్  - 92,204 (53 శాతం) ‌-  17,746 ఓట్ల మెజారిటీతో విజయం 

వైసిపి - కారుమూరి వెంకట నాగేశ్వరరావు  - 74,463 (43 శాతం) - ఓటమి 

click me!