విశాఖలో డిల్లీ యువతికి కరోనా...క్వారంటైన్ సెంటర్ కు తరలిస్తుండగా పరార్

By Arun Kumar PFirst Published Jun 22, 2020, 11:30 AM IST
Highlights

కరోనా పాజిటివ్ గా తేలిన  ఓ యువతి పోలీసుల కల్లుగప్పి పరారయిన సంఘటన విశాఖ నగరంలో చోటుచేసుకుంది.

విశాఖపట్నం: కరోనా పాజిటివ్ గా తేలిన  ఓ యువతి పోలీసుల కల్లుగప్పి పరారయిన సంఘటన విశాఖ నగరంలో చోటుచేసుకుంది. దీంతో నగరంలో టెన్షన్ వాతావరణం నెలకొంది. యువతి కోసం నగర పోలీసులు విస్తృతంగా గాలిస్తున్నారు. ఆమె ద్వారా ఈ వైరస్ ఇతరులకు వ్యాప్తి చెందే అవకాశం వుండటంతో నగర ప్రజలు అప్రమత్తంగా వుండాలని హెచ్చరించారు. 

ఇటీవల డిల్లీ నుండి ఓ యువతి వ్యక్తిగత పనిపై విశాఖకు వచ్చింది. ఈ క్రమంలో ఆమెకు కరోనా లక్షణాలున్నట్లు గుర్తించిన అధికారులు పరీక్ష నిర్వహించారు. ఇందులో ఆమెకు పాజిటివ్ గా నిర్దారణ అయ్యింది. దీంతో ఆమెను క్వారంటైన్ సెంటర్ కు తరలించేముందు అదృశ్యమయ్యింది. 

ఆమె ఇచ్చిన వ్యక్తిగత వివరాలు, ఫోన్ నెంబర్ కూడా తప్పుడుదని పోలీసులు గుర్తించారు. అంతేకాకుండా ఫ్లైట్ టికెట్ లోనూ రాంగ్ అడ్రస్ ను ఇచ్చినట్లు సమాచారం. దీంతో సదరు యువతిపై ఫోర్ టౌన్ పీఎస్ లో స్థానిక తహశీల్దార్ ఫిర్యాదు చేయగా 188 సెక్షన్ కింద కేసు నమోదు చేసి పోలీసులు ఆమె ఆచూకీ కోసం గాలిస్తున్నారు. 

read more  విజయవాడలో హైటెన్షన్: కరోనాతో వైసిపి కార్పోరేటర్ అభ్యర్థి మృతి

ఏపీ రాష్ట్రంలో 24 గంటల్లో 477 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో కరోనా కేసుల  8,929 సంఖ్య  చేరుకొన్నాయి. 24 గంటల్లో ఏపీకి చెందిన వారిలో 439 మందికి కరోనా సోకింది. ఇతర రాష్ట్రాల నుండి వచ్చిన వారిలో 34 మందికి  కోవిడ్ నిర్ధారణ అయింది. విదేశాల నుండి వచ్చినవారిలో 330 మందికి కరోనా సోకింది. వీరిలో 278 యాక్టివ్ కేసులు. 52 మంది ఆసుపత్రుల నుండి డిశ్చార్జ్ అయ్యారు. 

 రాష్ట్రం లోని నమోదైన మొత్తం 7059 పాజిటివ్ కేసు లకు గాను 3354 మంది డిశ్చార్జ్ కాగా106 మంది మరణించారు. ప్రస్తుతం చికిత్స పొందుతున్నవారి సంఖ్య 359.
 ఏపీలో ఇప్పటివరకు కరోనాతో 106 మంది మరణించారు. రాష్ట్రంలో 3354 మందికి కరోనా నుండి కోలుకొన్నారు.  ప్రస్తుతం ఆసుపత్రుల్లో 3599 మంది చికిత్స పొందుతున్నారు. 

గత 24 గంటల్లో 24451 మంది శాంపిల్స్ పరీక్షిస్తే  477 మందికి కరోనా సోకినట్టుగా ఏపీ ప్రభుత్వం ప్రకటించింది.కర్నూల్ జిల్లాలో అత్యధికంగా 1294 కరోనా కేసులు నమోదయ్యాయి. ఆ తర్వాతి స్థానంలో కృష్ణా జిల్లా నిలిచింది. కృష్ణాలో 1048 మందికి కరోనా సోకింది.

click me!