ఏపీ మంత్రి రోజాకు ఆ పత్రిక క్షమాపణలు.. తప్పు జరిగిందంటూ వివరణ

Published : Jul 16, 2023, 07:21 PM IST
ఏపీ మంత్రి రోజాకు ఆ పత్రిక క్షమాపణలు.. తప్పు జరిగిందంటూ వివరణ

సారాంశం

ఆంధ్రప్రదేశ్‌ మంత్రి రోజాకు డెక్కన్ క్రానికల్ పత్రిక సారీ చెప్పింది. మంత్రి రోజా జనసేనాని పవన్ కళ్యాణ్‌ను సన్నీ లియోన్‌తో పోల్చిన వ్యాఖ్యలు దుమారం రేపాయి. పలు పత్రికలు కథనాలు రాశాయి. అయితే అందులో ఓ పొరపాటు దొర్లింది.  

అమరావతి: ఆంధ్రప్రదేశ్ మంత్రి రోజాకు ప్రముఖ ఆంగ్ల పత్రిక డెక్కన్ క్రానికల్ క్షమాపణలు చెప్పింది. తప్పు జరిగిందని చెబుతూ వివరణ ఇచ్చింది. జనసేనా అధినేత పవన్ కళ్యాణ్‌పై విమర్శలు చేస్తూ మంత్రి రోజా సెల్వమణి.. సన్నీలియోన్‌తో పోల్చారు. ఆ వ్యాఖ్యలు దుమారం రేపాయి. ఆ వ్యాఖ్యలపై స్వయంగా సన్నీ లియోన్ స్పందించినట్టు సోషల్ మీడియాలో ఓ పోస్టు వచ్చింది. సన్నీ లియోన్ పేరిట ఉన్న ఆ అకౌంట్ నుంచి ఈ వ్యాఖ్యలపై స్పందించడంతో నిజంగానే సన్నీ లియోన్ స్పందించారని చాలా మంది భావించారు.

కానీ, ఆ ట్విట్టర్ హ్యాండిల్ నిజంగా సన్నీ లియోన్‌ది కాదు. దానికి బ్లూ టిక్ లేదు. అది వెరిఫైడ్ హ్యాండిల్ కాదు. కానీ, మంత్రి రోజా వ్యాఖ్యలపై మాత్రం సన్నీ లియోన్ స్వయంగా తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసినట్టుగా ప్రచారం జరిగింది. ఆ ప్రచారం సోషల్ మీడియా వరకే పరిమితం కాలేదు. మీడియాలోకీ పాకింది. పలు పత్రికల్లోనూ దీనిపై కథనాలు వచ్చాయి. డెక్కన్ క్రానికల్‌లోనూ ఓ కథనం ప్రచురితం అయింది.

Also Read: Target 2024: రేపు విపక్షాల భేటీ, ఎల్లుండి ఎన్డీయే కూటమి భేటీ.. ఏ కూటమిలో ఎన్ని పార్టీలు?

ఆ తర్వాత అది ఫేక్ ట్వీట్ అని తేలింది. నిజంగా అది సన్నీ లియోన్ ట్విట్టర్ హ్యాండిల్ కాదని తెలియవచ్చింది. కానీ, అప్పటికే పలు కథనాలు వచ్చేశాయి. ఈ నేపథ్యంలోనే డెక్కన్ క్రానికల్ తాను చేసిన తప్పిదాన్ని గుర్తించింది. అంతేకాదు, హుందాగా వ్యవహరిస్తూ మంత్రి రోజాకు ట్విట్టర్ హ్యాండిల్ ద్వారా సారీ అని చెప్పింది.

వైసీపీ సీనియర్ నేత, మంత్రి రోజా సెల్వమాణి గురించి ఓ ఫీచర్ స్టోరీ లో తప్పుగా రాసినందుకు చింతిస్తున్నామని డెక్కన్ క్రానికల్ రెసిడెంట్ ఎడిటర్ శ్రీరామ్ ట్వీట్ చేశారు. ఆ పేరడీ అకౌంట్ ట్వీట్‌ను సరిగా పరిశీలించాల్సింది కానీ, అలా చేయలేదని వివరణ ఇచ్చారు. అంతేకాదు, ఇది ఇక్కడితో ఆగి పోవాలని ఆశిస్తున్నానని, రోజా గారు సారీ అంటూ ట్వీట్ చేశారు.

PREV
Read more Articles on
click me!

Recommended Stories

IMD Cold Wave Alert : ఇక్కడ 8°C ఉష్ణోగ్రతలు, గడ్డకట్టే చలి.. ఈ ఏడు జిల్లాలకు డేంజర్ బెల్స్
IMD Rain Alert : అక్కడ వర్షాలు, ఇక్కడ చలి .. ఇక తెలుగు రాష్ట్రాల్లో అల్లకల్లోలమే..!