మద్యం అనుకుని విషద్రవం తాగి: 7కి చేరిన మృతుల సంఖ్య

By Siva KodatiFirst Published Feb 25, 2019, 5:14 PM IST
Highlights

విశాఖనగరంలోని గాజువాకలో మద్యంగా భావించి విష ద్రవాన్ని సేవించిన వారిలో మరణించిన వారి సంఖ్య 7కి చేరింది. 52వ వార్డులోని బ్రిడ్జి కింద నల్లని సీసాలో ఉంచిన ద్రవాలను మద్యంగా భావించిన 20 మంది దానిని సేవించారు.

నాలుగేళ్ల కిందట ఈ బ్రిడ్జి కింద నాటు సారాను తయారు చేసేవారు ఉండటంతో ఇదే మద్యం క్యాన్‌గా వారు భ్రమించారు. దానిని సేవించిన వెంటనే వారు వాంతులు, విరోచనాలతో కేజీహెచ్‌లో చేరారు. అప్పటికే ఆ రసాయనాలు రక్తంలో కలిసిపోవడంతో నలుగురు మరణించారు.

చికిత్స పొందుతూ మరో ముగ్గురు సోమవారం ప్రాణాలు కోల్పోయారు. దీనిపై జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ... ఆ విష పదార్థం వచ్చిన వాసనను బట్టి అది మద్యం కాదని భావిస్తున్నామని, పారిశ్రామిక అవసరాలకు వినియోగించే స్పిరిట్ కెమికల్‌గా అనుమానిస్తున్నట్లు వెల్లడించారు.

ఎక్సైజ్, పోలీస్ శాఖలు సంయుక్తంగా విచారణ చేపట్టాయని ప్రకటించారు. మరణించిన వారిలో అత్యధికులు 50 ఏళ్లు పైబడిన వారేనని పోలీసులు తెలిపారు. 
 
click me!