ఒకసారి ఎమ్మెల్యేగా చేశారు, మహిళా కమిషన్ చైర్ పర్సన్ గా పనిచేశారు. సాటి మహిళ అని కూడా చూకుండా దూషణకు దిగుతారా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. తాను కష్టపడి ఉద్యోగం సంపాదించానని తనను దరిద్రురాలు అంటారా అంటూ ఎస్సై మండిపడ్డారు.
గుంటూరు: తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత, మాజీ మహిళా కమిషన్ చైర్ పర్సన్ నన్నపనేని రాజకుమారిపై మహిళా ఎస్సై అనురాధ ఆగ్రహం వ్యక్తం చేశారు. చలో ఆత్మకూరు పిలుపు నేపథ్యంలో మాజీ సీఎం చంద్రబాబు నాయుడు ఇంటి వద్ద నన్నపనేని రాజకుమారి మాజీ ఎమ్మెల్యే వంగలపూడి అనితతోపాటు ఇతర మహిళా నేతలను పోలీసులు అరెస్ట్ చేశారు.
మహిళా నేతలను పోలీసు వాహనంలో తరలిస్తుండగా మహిళా ఎస్సై అనురాధకు, నన్నపనేని రాజకుమారికి వాగ్వాదం చోటు చేసుకుంది. ఒక్కసారిగా మహిళా ఎస్సై ఆగ్రహం వ్యక్తం చేశారు. తనను దరిద్రురాలు అంటారా అంటూ మండిపడ్డారు.
ఒకసారి ఎమ్మెల్యేగా చేశారు, మహిళా కమిషన్ చైర్ పర్సన్ గా పనిచేశారు. సాటి మహిళ అని కూడా చూకుండా దూషణకు దిగుతారా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. తాను కష్టపడి ఉద్యోగం సంపాదించానని తనను దరిద్రురాలు అంటారా అంటూ ఎస్సై మండిపడ్డారు.
దళితులు వల్లే ఈదరిద్రం అంటూ నన్నపనేని రాజకుమారి అన్నారని ఆమె ఆరోపించారు. ఇంతలో మాజీ ఎమ్మెల్యే వంగలపూడి అనిత కలుగజేసుకుని సర్ధిచెప్పే ప్రయత్నం చేశారు. ఒక ప్రజాప్రతినిధి అలా మాట్లాడటం సరికాదంటూ ఎస్‌ఐ అనురాధా మనస్తాపంతో అక్కడ నుంచి వెళ్లిపోయారు.
ఎస్సై అనురాధ ఆరోపించినట్లు తాను ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదని నన్నపనేని రాజకుమారి అన్నారు. కావాలనే ఆమె అలా ఆరోపిస్తోందని చెప్పుకొచ్చారు. మరోవైపు మాజీ ఎమ్మెల్యే వంగలపూడి అనిత సైతం నన్నపనేని రాజకుమారి అలాంటి వ్యాఖ్యలు చేయలేదని చెప్పారు. తాను ఒక దళిత ప్రజాప్రతినిధినేనంటూ చెప్పుకొచ్చారు.