ఇంట్లో ఒంటరిగా ఉన్న.. దళిత మూగ యువతిపై అత్యాచారం..

Published : May 16, 2022, 07:13 AM IST
ఇంట్లో ఒంటరిగా ఉన్న.. దళిత మూగ యువతిపై అత్యాచారం..

సారాంశం

ఆంధ్రప్రదేశ్ లోని అమరావతిలో దారుణం జరిగింది. ఓ మూగ దళిత బాలికపై అత్యాచారం చేశాడో దుర్మార్గుడు. ఇంట్లో ఒంటరిగా ఉన్న బాలికను గమనించి ఘాతుకానికి ఒడిగట్టాడు. 

అమరావతి : రోజురోజుకూ మహిళలపై అత్యాచారాలు పెరిగిపోతున్నాయి. ఒంటిరిగా ఉండాలంటే భయపడాల్సిన పరిస్థితి నెలకొంది. ఇలాంటి దారుణమే అమరావతిలో జరిగింది. గుంటూరు జిల్లా తెనాలిలో దళిత యువతిపై అత్యాచారం జరిగింది. మద్యంమత్తులో పక్కింటి వ్యక్తి ఈ దారుణానికి పాల్పడ్డాడు. యువతి తల్లిదండ్రులు ఇంట్లో లేని సమయం జక్రయ్య (27) శనివారం మధ్యాహ్నం అత్యాచారానికి పాల్పడినట్లు గుర్తించారు. అతడిని పోలీసులు అరెస్టు చేసి ఆదివారం కోర్టులో హాజరుపరిచారు. మాటలు రాని 20 ఏళ్ల కుమార్తెను ఒంటరిగా ఇంట్లో ఉంచి తల్లిదండ్రులు కూలికి వెళ్ళినప్పుడు ఈ దారుణం చోటుచేసుకుంది.

తల్లిదండ్రులు డయల్ 100కు సమాచారం ఇవ్వడంతో పోలీసులు వచ్చి బాధిత కుటుంబం నుంచి ఫిర్యాదు తీసుకున్నారు. యువతిని తెనాలి ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. బాధితురాలి ఆరోగ్యం నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు. నిందితుడు జకరయ్య వ్యవహారశైలిపై గతంలోనే బాధిత యువతి తల్లిదండ్రులు అనుమానించి తాము లేని సమయంలో ఇంటికి రావడం సరికాదని హెచ్చరించినట్లు చెబుతున్నారు. నిందితుడు తాపీ పని చేస్తూ వచ్చిన డబ్బుతో మద్యం సేవిస్తూ ఉంటాడని పోలీసులు తెలిపారు. అతడి భార్య పురుటికోసం పుట్టింటికి వెళ్ళింది అని తెలిపారు.

మూగ యువతి కావడంతో ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలుసుకోవడానికి పోలీసులు గుంటూరులోని బధిర పాఠశాలకు చెందిన ఉపాధ్యాయులను పిలిపించి బాధిత యువతితో మాట్లాడించారు. త్వరలోనే చార్జిషీట్ నమోదు చేసి నిందితుడిని శిక్షపడేలా చేస్తామని పోలీసులు తెలిపారు.

ఇదిలా ఉండగా, మే 13న గోవాలో ఓ దారుణ ఘటన వెలుగుచూసింది. గోవాలోని ఓ రిసార్టులో విదేశీ బాలికపై molestation జరిగిన దారుణ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. రష్యాకు చెందిన 12 ఏళ్ల బాలికపై ఉత్తర goaలోని అరంబోల్ లోని ఓ రిసార్ట్ లో రూమ్ అటెండర్గా పనిచేస్తున్న వ్యక్తి లైంగిక దాడికి పాల్పడగా.. అతనిని arrest చేసినట్లు పోలీసులు వెల్లడించారు. నిందితుడు తన కుమార్తెపై స్విమ్మింగ్ పూల్ లో, ఆ తర్వాత హోటల్ గదిలో ఈ నెల 6న అత్యాచారానికి పాల్పడినట్లు బాధిత బాలిక తల్లి పోలీస్ స్టేషన్లో ఈ నెల 9న ఫిర్యాదు చేసింది. 

దగ్గర్లో ఉన్న మార్కెట్ లో కొన్ని వస్తువులు కొనుక్కునేందుకు బయటికి వెళ్లినప్పుడు తన కూతురిని స్విమ్మింగ్ పూల్ లో వదిలేసి వెళ్లినట్లు ఆమె ఫిర్యాదులో పేర్కొన్నట్లు పోలీసులు తెలిపారు. ఈ ఘటన తర్వాత నిందితుడు పరారయ్యాడని పెర్నెమ్ పోలీస్ ఇన్స్పెక్టర్ విక్రమ్ నాయక్ తెలిపారు. తమకు ఫిర్యాదు అందిన 24 గంటల్లోనే అతడు కర్ణాటకలోని గదగ్ కు చెందిన ravi lamani గా గుర్తించి ఈ నెల 10న అరెస్టు చేసినట్లు వివరించారు. నిందితుడికి వివాహం కూడా అయిందన్నారు. ఈ కేసులో నిందితుడిమీద పోక్సో చట్టం సహా పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్టు పోలీసులు పేర్కొన్నారు. 
 

PREV
click me!

Recommended Stories

Swathi Deekshith & Pranavi Manukonda Visit Tirumala Temple: శ్రీవారిసేవలో ప్రముఖులు | Asianet Telugu
YS Jagan Attends Wedding: నూతన వధూవరులను ఆశీర్వదించిన వై ఎస్ జగన్ | Asianet News Telugu