Hamoon: హమూన్ తుఫాను ఎఫెక్ట్.. ఏపీలోని పలు ప్రాంతాల్లో వర్షాలు

By Mahesh Rajamoni  |  First Published Oct 24, 2023, 10:49 AM IST

Cyclone Hamoon: బంగాళాఖాతంలో ఏర్ప‌డిన అల్ప‌పీడ‌నం తీవ్ర తుఫానుగా బలపడి అక్టోబర్ 24 తెల్లవారుజామున 2:30 గంటలకు వాయువ్య బంగాళాఖాతంలో ఒడిశాలోని పారాదీప్కు తూర్పు-ఆగ్నేయంగా 210 కిలోమీటర్లు, పశ్చిమ బెంగాల్లోని దిఘాకు ఆగ్నేయంగా 270 కిలోమీటర్లు, బంగ్లాదేశ్ లోని ఖేపుపారాకు ఆగ్నేయంగా 350 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉందని ఐఎండీ తెలిపింది. రానున్న ఆరు గంటల్లో 'హమూన్' మరింత బలపడి అతి తీవ్ర తుఫానుగా మారనుందని ఐఎండీ శాస్త్రవేత్త ఉమాశంకర్ దాస్ తెలిపారు.
 


Cyclone Hamoon-rains in AP: పశ్చిమ బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడి తీవ్ర వాయుగుండంగా మారే అవకాశం ఉందని వాతావరణ శాఖ (ఐఎండీ) ఆంధ్రప్రదేశ్‌కు హెచ్చరికలు జారీ చేసింది. అక్టోబరు 25న బంగ్లాదేశ్ తీరం దాటే అవకాశం ఉందని.. ఫలితంగా కోస్తాంధ్రలో రెండు మూడు రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, విశాఖపట్నం, అనకాపల్లి జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని తెలిపింది. ఈ వాతావరణ వ్యవస్థ సముద్రంలో బలహీనపడి బంగ్లాదేశ్‌లోని చిట్టిగాంగ్ సమీపంలో తీవ్ర వాతావరణ వ్యవస్థగా మారే అవకాశం ఉంది లేదా ఇది తీవ్ర తుఫానుగా మారి తీరం దాటే అవకాశం ఉంది. దీని ప్రభావంతో ఉత్తర కోస్తా ఆంధ్రలో ప్రస్తుతం మేఘావృతమైన వాతావరణం, కోస్తా వెంబడి బలమైన గాలులు వీస్తున్నాయి. మత్స్యకారులు సముద్రంలోకి వెళ్లవద్దని సూచించారు. ఆంధ్రప్రదేశ్‌పై ఈ తుఫాను ప్ర‌భావం ఎంత‌లా ఉంటుంద‌నేది పూర్తిగా తెలియలేదు.

కాగా, బంగాళాఖాతంలో ఏర్ప‌డిన తుఫాను 'హమూన్' మంగళవారం తెల్లవారుజామున వాయువ్య బంగాళాఖాతంపై తీవ్ర తుఫానుగా మారిందని ఐంఎడీ తెలిపింది. భారత వాతావరణ విభాగం (IMD) ప్రకారం, వాయువ్య, ఆనుకుని ఉన్న పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో కేంద్రీకృతమై ఉన్న 'హమూన్' గత 6 గంటల్లో గంటకు 18 కిలో మీట‌ర్ల వేగంతో ఈశాన్య దిశగా కదిలింది. బంగాళాఖాతంలో ఏర్ప‌డిన అల్ప‌పీడ‌నం తీవ్ర తుఫానుగా బలపడి అక్టోబర్ 24 తెల్లవారుజామున 2:30 గంటలకు వాయువ్య బంగాళాఖాతంలో ఒడిశాలోని పారాదీప్కు తూర్పు-ఆగ్నేయంగా 210 కిలోమీటర్లు, పశ్చిమ బెంగాల్లోని దిఘాకు ఆగ్నేయంగా 270 కిలోమీటర్లు, బంగ్లాదేశ్ లోని ఖేపుపారాకు ఆగ్నేయంగా 350 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉందని ఐఎండీ తెలిపింది.

Latest Videos

రానున్న ఆరు గంటల్లో 'హమూన్' మరింత బలపడి అతి తీవ్ర తుఫానుగా మారనుందని ఐఎండీ శాస్త్రవేత్త ఉమాశంకర్ దాస్ తెలిపారు. ఇది దాదాపు ఉత్తర-ఈశాన్య దిశగా కదులుతూ ఖేపుపరా, చిట్టగాంగ్ మధ్య అక్టోబరు 25 మధ్యాహ్న సమయంలో తీవ్ర అల్పపీడనంగా బంగ్లాదేశ్ తీరం దాటే అవకాశం ఉంది. సముద్రం చాలా ఉధృతంగా ఉండడంతో పాటు అక్టోబర్ 24 త‌ర్వాత కూడా ఇది కొనసాగే అవకాశం ఉన్నందున, అక్టోబర్ 25న ఇది చాలా ఉధృతంగా మారే అవకాశం ఉంద‌నీ, ఒడిశా తీరం, పశ్చిమ మధ్య & ఉత్తర బంగాళాఖాతం వెంబడి సముద్రంలోకి వెళ్లవద్దని మత్స్యకారులకు సూచించారు. దీని ప్ర‌భావంతో నేడు ఏపీలోని ప‌లు ప్రాంతాల‌తో పాటు ఒడిశాలోని బాలాసోర్, భద్రక్, కేంద్రపాడ, జగత్‌సింగ్‌పూర్ జిల్లాల్లో తేలికపాటి నుండి మోస్తరు వర్షం/ ఉరుములతో కూడిన వర్షం కురిసే అవకాశం ఉంది.

click me!