తుఫాను ప్రభావం.. నేలకొరిగిన భారీ వృక్షాలు

By telugu news teamFirst Published Nov 27, 2020, 1:34 PM IST
Highlights

అగ్నిమాపక శాఖ పేరు 2009నుంచి డిజార్డర్స్ మేనేజ్ మెంట్ లో కలిపారు. గతంలో అనేక తుఫాన్లు లో మా‌ సిబ్బంది అనేక సాహసోపేతంగా పని‌చేశారు.ఈ తుఫాన్ లో మూడు జిల్లాల్లో 87టిం లుగా 523 మంది పనిచేస్తున్నారు

నివర్ తుఫాను ప్రభావం ఆంధ్రప్రదేశ్ పై బాగానే చూపిస్తోంది. మరీ ముఖ్యంగా నెల్లూరు, చిత్తూరు, కడప జిల్లాలో మరింత ఎక్కువగా ఉంది.  పలు ప్రాంతాల్లో భారీ వృక్షాలు నేలకొరిగాయి. ఇలాంటి ప్రాంతాల్లో అగ్నిమాపక సిబ్బంది 24 గంటల రెస్క్యూ ఆపరేషన్ లో పాల్గొన్నారు. 

వందల మందిని వరదల నుంచి కాపాడి సురక్షిత ప్రాంతాలకు తరలించారు.మూడు రోజులుగా మా సిబ్బంది తుఫాన్ ప్రాంతాలలో ప్రజల  రక్షణ చర్యలు చేపట్టారు.నెల్లూరు లో 12, చిత్తూరు లో 32, కడపలో 22, అనంతపురంలో 10, ప్రకాశం లో 11 టీం లు పని చేస్తున్నాయి.

అగ్నిమాపక శాఖ పేరు 2009నుంచి డిజార్డర్స్ మేనేజ్ మెంట్ లో కలిపారు. గతంలో అనేక తుఫాన్లు లో మా‌ సిబ్బంది అనేక సాహసోపేతంగా పని‌చేశారు.ఈ తుఫాన్ లో మూడు జిల్లాల్లో 87టిం లుగా 523 మంది పనిచేస్తున్నారు

కడపజిల్లా లో ఒక అమ్మాయి నదిలో పడిపోతే వెంటనే కాపాడారు.కాళహస్తి లో  వరదలో చిక్కుకున్న ఇద్దరు రైతులను కాపాడారు.స్థానిక ఎమ్మెల్యే అక్కడి సిబ్బంది కి లక్ష రూపాయలు బహుమానంగా ప్రకటించారు

SDRF, NDRF ల కన్నా స్థానికంగా అగ్నిమాపక సిబ్బందికి అవగాహన ఎక్కువుగా ఉంటుంది.అందువల్ల ఎక్కడ ప్రకృతి విపత్తులు కలిగినా ఆయా ప్రాంతాలలో సిబ్బంది ని అలెర్ట్ చేస్తున్నాం

ఎప్పుడు ఎక్కడ ఎటువంటి విపత్తు వచ్చినా అగ్నిమాపక సిబ్బంది ఆపరేషన్ లో ముందుంటారు.ఎక్కడ ఎటువంటి ప్రమాదాలు జరిగినా...‌మా‌ సిబ్బంది రెస్క్యూ చేసి ప్రాణాలు కాపాడుతున్నారు.ఒరిస్సా లో 476మంది  సిబ్బందికి వివిధ అంశాలలో ప్రత్యేక శిక్షణ  ఇప్పించినట్లు అధికారులు తెలిపారు. వరల్డ్ బ్యాంకు సహకారంతో ఈ శిక్షణ కొనసాగుతుంది
 

click me!