రాజధానిని విశాఖకు ఎలా తరలిస్తారు: ఏపీ హైకోర్టు వ్యాఖ్యలు

By narsimha lodeFirst Published Nov 27, 2020, 1:22 PM IST
Highlights

 అమరావతి రాజధాని అంశంపై శుక్రవారం నాడు ఏపీ హైకోర్టు తీవ్ర వ్యాఖ్యలు చేసింది.
పరిపాలనా వికేంద్రీకరణపై హైకోర్టులో ఇవాళ విచారణ చేసింది. 

అమరావతి: అమరావతి రాజధాని అంశంపై శుక్రవారం నాడు ఏపీ హైకోర్టు తీవ్ర వ్యాఖ్యలు చేసింది.
పరిపాలనా వికేంద్రీకరణపై హైకోర్టులో ఇవాళ విచారణ చేసింది. 

వేలకోట్లు ఖర్చుపెట్టి ఇపుడు పరిపాలన రాజధానిని ఎలా విశాఖకు తరలిస్తారని హైకోర్టు ప్రశ్నించింది. రాజధాని తరలింపు ఒక రకంగా రాజ్యాంగాన్ని ధిక్కరించడమేనని హైకోర్టు వ్యాఖ్యానించింది. 

దేశంలో ఎక్కడా ఇలాంటి పరిస్థితులు చోటు చేసుకోలేదని న్యాయస్థానం అభిప్రాయపడింది. ఇలాంటి విషయాల్లో హైకోర్టు జోక్యం చేసుకుంటుందని తేల్చి చెప్పింది.అమరావతిలోనే రాజధానిని కొనసాగించాలని కోరుతూ  రాజధాని రైతులు ఏపీ హైకోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు. రాజధాని రైతులతో పాటు  కొన్ని పార్టీలు, సంస్థలు కూడా దాఖలు చేసిన పిటిషన్లను హైకోర్టు  విచారిస్తుంది.అన్ని పిటిషన్లను కలిపి రోజూవారీగా విచారణ చేస్తున్న విషయం తెలిసిందే.

రాష్ట్రంలో మూడు రాజధానులు ఉండాలనేది వైసీపీ అభిప్రాయంగా కన్పిస్తోంది. విశాఖను పరిపాలన రాజధానిగా చేయాలని వైసీపీ ప్రభుత్వం ప్లాన్ చేస్తోంది. మూడు రాజధానుల ప్రతిపాదనను రాష్ట్రంలోని విపక్షాలన్నీ కూడా తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి.

click me!