Cyclone Asani Effect: తీరానికి కొట్టుకొచ్చిన "బంగారం"మందిరం..చూసేందుకు ఎగ‌బ‌డ్డ జ‌నం..!

Published : May 10, 2022, 11:02 PM ISTUpdated : May 10, 2022, 11:09 PM IST
Cyclone Asani Effect: తీరానికి కొట్టుకొచ్చిన  "బంగారం"మందిరం..చూసేందుకు ఎగ‌బ‌డ్డ జ‌నం..!

సారాంశం

Cyclone Asani Effect: అసాని తుపాన్ ప్రభావంతో శ్రీకాకుళం జిల్లా సంతబొమ్మాళి సున్నాపల్లి రేవుకు ఇతర దేశానికి చెందిన బంగారు వర్ణం కలిగిన రధం సముద్రం ఒడ్డుకు కొట్టుకువచ్చింది. దీని గ‌మ‌నించిన ప్ర‌జ‌లు తొలుత భయ‌ప‌డిన‌.. దానిని వీక్షించేందుకు  ప్రజలు ఎగపడుతున్నారు. మలేషియా,థాయిలాండ్ లేదా జపాన్ దేశాలకు చెందినది అయి ఉండవచ్చునని కొంతమంది సీమెన్ లు అంటున్నారు.  

Cyclone Asani Effect: ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన అసని తుఫాన్ మ‌రింత బ‌ల‌ప‌డింది.  ఈ తుఫాన్ తీవ్ర రూపాంతరం చెందడంతో.. తూర్పు తీర రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో తీర ప్రాంతాల వారిని సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. పశ్చిమ మధ్య బంగాళాఖాతం మీదుగా 25 కిమీ వేగంతో..  కాకినాడకు దక్షిణ-ఆగ్నేయంలో 210 కి.మీ దూరంలో కదులుతోందని వాతావ‌ర‌ణ అధికారులు తెలియ‌జేశారు. దక్షిణ-నైరుతి దిశలో 310 కి.మీ, విశాఖపట్నం (ఆంధ్రప్రదేశ్), గోపాల్పూర్ (ఒడిశా)కి నైరుతి దిశలో 530 కి.మీ మ‌రియు 630 కి.మీ దూరంలో తుఫాన్ కదులుతోందని  వాతావ‌ర‌ణ శాఖ వెల్ల‌డించింది. 

ఇదిలా ఉంటే.. శ్రీకాకుళం జిల్లాలో ఓ వింత చోటుచేసుకుంది. అసని తుపాను Cyclone Asani ప్రభావంతో ఇతర దేశానికి చెందిన ఓ బంగారు మందిరం (రథం) సున్నాపల్లి రేవుకు కొట్టుకొచ్చింది. ఇది గమనించిన స్థానికులు తొలుత‌ ఆందోళనకు గురయ్యారు. అనంత‌రం.. మందిరం లాంటి రథాన్ని స్థానికులు తాళ్లతో లాగుతూ ఒడ్డుకు తీసుకొచ్చారు. అక్కడి ప్రజలు వీక్షించేందుకు ఎగపడుతున్నారు.

ఈ రధంపై  తేది 16-1-2022 అని విదేశీ బాష లో లిక్కించి ఉందని మలేషియా,థాయిలాండ్ లేదా జపాన్ దేశాలకు చెందినది అయి ఉండవచ్చునని కొంతమంది సీమెన్ లు అంటున్నారు.ఇంతవరకు తితిలి వంటి పెద్ద తుఫానులు వచ్చినప్పుడు కూడా ఇటువంటి విచిత్రమైన మందిర రధం చూడలేదని తెలియజేస్తున్నారు. మేరైన్ పోలీసులు స్వాధీనం చేసున్నట్లు తెలిజేశారు.   Cyclone Asani ప్రభావంతో బంగారం రంగులో ఉన్న రథం తమ తీరానికి కొట్టుకురావడంతో స్థానికులకు వింత అనుభూతి కలిగింది.

అసని తుఫాన్ మరికొన్ని గంటల్లో కోస్తాంధ్ర తీరం దాటనున్న‌ట్టు వాతావరణ కేంద్రం పేర్కొంది. ఈ క్రమంలో  భీకర గాలులతో వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే ప్రభుత్వ యంత్రాంగం సిద్ధమైంది. ఇప్పటికే రెండు ఎన్డీఆర్ఎఫ్ బృందాలు విజయవాడకు చేరుకున్నాయి. కాగా, తీర ప్రాంత మండలాల్లో ప్రత్యేక కంట్రోల్ రూమ్‌లు ఏర్పాటు చేశారు. ఈ నేప‌థ్యంలో కాకినాడ, విశాఖ పోర్టుల్లో గ్రేట్ డేంజర్ సిగ్నల్ 10 జారీ చేయ‌గా.. ఉమ్మడి గుంటూరు, కృష్ణా జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేశారు వాతావరణ శాఖ అధికారులు.

మొత్తంగా ఆంధ్రప్రదేశ్‌లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నది. అసని తుఫాన్ కోస్తాంధ్ర తీరానికి వచ్చిన తర్వాత వాయవ్య బంగాళాఖాతంలోకి ప్రవేశించే అవకాశం ఉన్నది. కాకినాడ తీరానికి వచ్చిన తర్వాత దిశను మార్చుకుంటుందని వాతావరణ శాఖ అంచనా వేసింది. 

ఈ నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలని, లోతట్టు ప్రాంతల్లో ఉండకూడదని, పాత భవనాల్లోనూ ఉండరాదని అధికారులు సూచనలు చేశారు. తుఫాన్ రానున్న నేపథ్యంలో ప్రజలు జాగరూకతగా ఉండాలని కోరుతున్నారు. మచిలీపట్నం వద్ద తీరం తాకనున్న అసని తుఫాన్.. మళ్లీ విశాఖ వద్ద సముద్రంలోకి ప్రవేశిస్తుందని అంచనా వేస్తున్నారు. ఈ ప్రభావంత కోస్తా, రాయలసీమ జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. 
 


"

PREV
click me!

Recommended Stories

IMD Cold Wave Alert : ఇక్కడ 8°C ఉష్ణోగ్రతలు, గడ్డకట్టే చలి.. ఈ ఏడు జిల్లాలకు డేంజర్ బెల్స్
IMD Rain Alert : అక్కడ వర్షాలు, ఇక్కడ చలి .. ఇక తెలుగు రాష్ట్రాల్లో అల్లకల్లోలమే..!