ఉద్రిక్తత: పోలీసులకు ఎదురు తిరిగిన కటాఫ్ ఏరియా గిరిజనులు

Published : Oct 13, 2018, 12:15 PM IST
ఉద్రిక్తత: పోలీసులకు ఎదురు తిరిగిన కటాఫ్ ఏరియా గిరిజనులు

సారాంశం

శుక్రవారం ఉదయం కాల్పులు శబ్దం విన్న కట్ ఆఫ్ ఏరియా  పంచాయతీలైన ఆండ్రాపల్లి, పనసపుట్టు, జోడంలకు చెందిన గిరిజనులు గుర్రం శెట్టి జంక్షన్ వద్ద సమావేశమయ్యారు.

విశాఖపట్నం: ఉత్తరాంధ్రలో ఒడిశా సరిహద్దుల్లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. కటాఫ్ ఏరియా గిరిజనులు పోలీసులను ఎదిరించారు. 
ఒరిస్సా ప్రాంతంలోకి ఆంధ్ర పోలీసులు వచ్చి తమ గ్రామాలను చుట్టుముట్టి తమ ను నిర్బంధించి ఇష్టానుసారంగా కొడుతూ బెదిరిస్తూ నరక యాతన చూపుతున్నారని వారు ఆరోపిస్తున్నారు. 

ఎన్ కౌంటర్ల పేరుతో తమ వారిని కాల్చి చంపుతున్నారని, మావోల ముద్ర వేస్తూ తమ వారిని అక్రమంగా పోలీసులు అదుపులోకి తీసుకున్నారని ఆ ప్రాంత గిరిజనులు చెబుతున్నారు. శుక్రవారం ఉదయం కాల్పులు శబ్దం విన్న కట్ ఆఫ్ ఏరియా  పంచాయతీలైన ఆండ్రాపల్లి, పనసపుట్టు, జోడంలకు చెందిన గిరిజనులు గుర్రం శెట్టి జంక్షన్ వద్ద సమావేశమయ్యారు.

ఎన్ కౌంటర్ మరణించిన మృతదేహాన్ని తీసుకుని వస్తుండగా పోలీసులకు వారు ఎదురు తిరిగారు. అదుపులో తీసుకున్న నలుగురు గిరిజనులను విడిచిపెట్టాలని డిమాండ్ చేశారు. దీంతో పోలీసులు ఆ ప్రాంత గిరిజనులు మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. ఆ ప్రాంత గిరిజనులంతా కత్తులు గడ్డలు కర్రలు పట్టుకుని పోలీసులపై వైపు వచ్చారు. 

తమ గ్రామంలో అమాయకులను పోలీసులు అదుపులోకి తీసుకోవడం సరికాదంటూ నినాదాలు చేశారు పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో పోలీసులు భాష్పవాయువును ప్రయోగించారు. దీంతో గిరిజనులు వెనక్కి పరుగులు పెట్టారు. 

సంబంధిత వార్త

కిడారి, సోమ హత్య: ఆపరేషన్‌లో పాల్గొన్న మహిళా నక్సలైట్ కాల్చివేత

PREV
click me!

Recommended Stories

IMD Cold Wave Alert : గజగజా వణికిపోతున్న తెలుగు రాష్ట్రాలు... ఈ చలి తీవ్రత తగ్గేదెన్నడో తెలుసా?
Vegetable Price : ఈ వారాంతం సంతలో కూరగాయల ధరలు ఎలా ఉండనున్నాయో తెలుసా?