వ్యభిచార గృహానికి వెళ్లిన విటుడిని విచారించడానికి వీల్లేదు... ఏపీ హైకోర్టు

By SumaBala Bukka  |  First Published May 3, 2022, 7:40 AM IST

వ్యభిచారగృహానికి వెళ్లిన విటుడి మీద క్రిమినల్ విచారణ చేపట్టవద్దని, అతడిని విచారించాల్సిన అవసరం లేదని ఆంధ్రప్రదేశ్ హైకోర్టు స్పష్టం చేసింది. ఈ మేరకు సోమవారం ఓ కేసును రద్దు చేసింది. 


అమరావతి : Brothel houseకి వెళ్లిన విటుడిపై కేసు నమోదు చేసి, న్యాయస్థానంలో విచారించడానికి వీల్లేదని High Court స్పష్టం. ఓ వ్యక్తిపై దిగువ కోర్టులో పెండింగ్లో ఉన్నకేసును రద్దు చేసింది. హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ డి.రమేష్ ఇటీవల ఈ మేరకు Judgment ఇచ్చారు. గుంటూరు జిల్లా నగరపాలెం పోలీసులు 2020లో నమోదు చేసిన కేసు ఆధారంగా గుంటూరులోని మొదటి తరగతి జ్యుడిషియల్ మెజిస్ట్రేట్ కోర్టులో(ప్రత్యేక మొబైల్ కోర్టు) తనపై పెండింగ్లో ఉన్నకేసును రద్దు చేయాలంటూ ఓ వ్యక్తి హైకోర్టును ఆశ్రయించారు. అతని తరఫు న్యాయవాది వాదనలు వినిపిస్తూ.. 2020 అక్టోబర్ 10న పోలీసులు పిటిషనర్ పై కేసు నమోదు చేశారని,  దర్యాప్తు జరిపి,  సంబంధిత కోర్టులో అభియోగపత్రం వేశారని తెలిపారు.

వ్యభిచార గృహంపై దాడి చేసినప్పుడు అక్కడ కస్టమర్ గా ఉన్నట్లు పోలీసులు ఆరోపిస్తున్నారని పేర్కొన్నారు. వ్యభిచార గృహాన్ని నిర్వహించేవారు, ఇంటిని వ్యభిచారం కోసం ఇచ్చేవారిపై కేసు పెట్టి విచారించవచ్చు. కానీ, సొమ్ము చెల్లించి విటుడిగా వెళ్లిన వ్యక్తిని విచారించడానికి వీల్లేదని చట్టం నిబంధనలు చెబుతున్నాయని తెలిపారు. వ్యభిచార గృహానికి వెళ్లిన కష్టమర్ పై నమోదైన కేసును ఇదే కోర్టు గతంలో కొట్టేసిందని గుర్తు చేశారు. అదనపు పిపి వాదనలు వినిపిస్తూ..  పిటిషనర్ కేవలం కస్టమర్ మాత్రమేనని తెలిపారు. ఈ వ్యవహారంపై గతంలో హైకోర్టు తీర్పు ఇచ్చిందన్నారు. వీటన్నింటినీ పరిగణనలోకి తీసుకుని తగిన ఉత్తర్వులు ఇవ్వాలని కోరారు. దీంతో న్యాయమూర్తి, పిటిషనర్పై కేసును రద్దు చేస్తూ తీర్పు ఇచ్చారు. 

Latest Videos

ఇదిలా ఉండగా, ఏప్రిల్ 13న తెలంగాణలోని మహబూబాబాద్ లో  prostitution gang గుట్టును టాస్క్ఫోర్స్ పోలీసులు రట్టు చేశారని Mahabubabad జిల్లా ఎస్పీ శరత్చంద్ర పవార్ అన్నారు. మహబూబాబాద్ టౌన్ పోలీస్ స్టేషన్ సమావేశ మందిరంలో మంగళవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఎస్పీ శరత్ చంద్ర పవార్ కేసు వివరాలు వెల్లడించారు. నమ్మదగిన సమాచారం మేరకు ఉన్నతాధికారుల ఆదేశాలతో మహబూబాబాద్ టాస్క్ఫోర్స్ పోలీసులు మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో కొంతమంది ముఠాగా ఏర్పడి వ్యభిచారం నిర్వహిస్తున్నట్లుగా గుర్తించారు.

వెంటనే టాస్క్ఫోర్స్ ఇన్స్పెక్టర్ గండ్రతి మోహన్, మహబూబాబాద్ టౌన్ ఇన్స్పెక్టర్ ఎడ్లపల్లి సతీష్ వారి సిబ్బందిని తీసుకుని జిల్లా కేంద్రంలోని రెడ్డి బజార్ లో గల ఒక గృహం మీద దాడి చేశారు. ఆ గృహంలో సర్వోదయ సంస్థలో పనిచేస్తున్న కొందరు వ్యక్తులు, ఇతర ప్రాంతాలకు చెందిన కొంతమంది వ్యభిచారం నిర్వహిస్తున్నకొందరిని అదుపులోకి తీసుకున్నారు. పట్టుబడిన కురవి మండలంలోని తాటి తండా గ్రామ పరిధిలో గల పిల్లిగుండ్ల తండకు చెందిన బానోతు రవి, రాజోలు గ్రామ పరిధిలో గల హరిసింగ్ తండాకు చెందిన మాలోతు మంగీలాల్ అలియాస్ లోకేష్, బంచరాయి తండాకు చెందిన భూక్యా కన్కి,  మహబూబాద్ మండలంలోని పర్వతగిరికి చెందిన బాదావత్ సరోజ,  సోమ్లా తండాకు చెందిన బాదావత్ రాములు (విటుడు) ఉన్నారు.  కొంతమంది వ్యక్తులు చుట్టుపక్కల ప్రాంతాల మహిళలను ట్రాప్ చేసి వారితో వ్యభిచారం నిర్వహిస్తున్నారు.

అదే మాదిరిగా 12వ తేదీన కూడా కొంత మంది మహిళలతో వ్యభిచారం నిర్వహిస్తుండగా.. ఈ సమాచారం టాస్క్ ఫోర్స్ పోలీసులకు చేరింది. దీంతో వెంటనే రంగంలోకి దిగిన వారు, రైడ్ చేసి పట్టుకున్నారు వారి వద్ద నుంచి మొబైల్ ఫోన్లు, ఒక ఆటో, రెండు ద్విచక్ర వాహనాలు స్వాధీనం చేసుకున్నారు. వేణు, పద్మ, swathi, శారద పరారీలో ఉన్నారు. ఈ కేసులో విశ్వసనీయ సమాచారం సేకరించి నేరస్తులను పట్టుకున్న టాస్క్ఫోర్స్ ఇన్స్పెక్టర్ టౌన్ ఇన్స్పెక్టర్, టాస్క్ ఫోర్స్ ఎస్ఐలు జగదీష్, రామారావు, టాస్క్ఫోర్స్ సిబ్బంది రివార్డులు అందజేసి అభినందించారు.

click me!