అమరావతి 'హ్యపీనెస్ట్‌' ప్లాట్ల బుకింగ్‌‌కు అనూహ్య స్పందన

Published : Dec 10, 2018, 11:51 AM ISTUpdated : Dec 10, 2018, 01:21 PM IST
అమరావతి  'హ్యపీనెస్ట్‌' ప్లాట్ల బుకింగ్‌‌కు అనూహ్య స్పందన

సారాంశం

ఆంధ్రప్రదేశ్ రాజధాని సీఆర్‌డీఏ‌లో నిర్మిస్తున్న హ్యాపీనెస్ట్‌ ప్రాజెక్టుకు  ప్రజల నుండి అనూహ్య స్పందన లభించింది.

అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాజధాని సీఆర్‌డీఏ‌లో నిర్మిస్తున్న హ్యాపీనెస్ట్‌ ప్రాజెక్టుకు  ప్రజల నుండి అనూహ్య స్పందన లభించింది.  నిమిషాల వ్యవధిలో వందలాది ప్లాట్లను బుక్ చేసుకొన్నారు.

సోమవారం నాడు ఉదయం 9 గంటలకు  ప్లాట్ల బుకింగ్ ప్రారంభమైంది.  ఈ బుకింగ్ ప్రారంభమైన అరగంటలోనే  సుమారు 700కు పైగా ప్లాట్లు బుక్ అయ్యాయి.  సీఆర్‌డీఏ‌ గృహ నిర్మాణ ప్రాజెక్టును హ్యాపీ నెస్ట్‌ పేరుతో  ప్రారంభించిన విషయం తెలిసిందే.

ఈ ప్లాట్ల బుకింగ్ కోసం  విజయవాడ సీఆర్డీఏ కార్యాలయంలో ప్లాట్లు బుక్ చేసుకొన్నవారికి సంబంధిత బుకింగ్ పత్రాలను సీఆర్డీఏ కమిషనర్ శ్రీధర్  అందించారు. హ్యాపీనెస్ట్ ‌లో ప్లాట్లను బుక్ చేసుకొన్న వారికి 24 నెలల్లోనే  ప్రాజెక్టును పూర్తి చేసి అందిస్తారు. ఈ ప్రాజెక్టుకు సంబంధించి  వారం రోజుల్లోనే  టెండర్లను  ప్రారంభిస్తారు.

ఈ ప్రాజెక్టులో మొత్తం 1200 ఫ్లాట్లు నిర్మిస్తుండగా 300 ఫ్లాట్లకు గత నవంబరు 9న సీఆర్‌డీఏ ఆన్‌లైన్‌లో బుకింగ్‌ నిర్వహించింది. తొలివిడతలో అనూహ్య స్పందన రావడంతో మిగతా 900 ఫ్లాట్లకు సోమవారం బుకింగ్‌ నిర్వహించింది. 
 

PREV
click me!

Recommended Stories

బస్సులో పరిచయం.. ప్రేమ పేరుతో మోసం రూ.20 లక్షలు బురిడీ | Bus Conductor Accused of Cheating Woman
Employee Holidays : స్టూడెంట్స్ కు 13 రోజులు సరే.. ఉద్యోగులకు దసరా సెలవులు ఎన్నిరోజులో తెలుసా?