కాకినాడ పోర్టులో కుప్పకూలిన భారీ క్రేన్లు.. ఒకరి మృతి

Published : Dec 29, 2018, 12:41 PM IST
కాకినాడ పోర్టులో కుప్పకూలిన భారీ క్రేన్లు.. ఒకరి మృతి

సారాంశం

కాకినాడ డీప్ వాటర్ పోర్టులో శనివారం ఉదయం భారీ ప్రమాదం చోటుచేసుకుంది. ఓడలలో నుంచి సరుకులను కిందకు దించేందుకు ఉపయోగించే ఆఫ్ షోర్ క్రేన్లు రెండు కుప్పకూలాయి. 

కాకినాడ డీప్ వాటర్ పోర్టులో శనివారం ఉదయం భారీ ప్రమాదం చోటుచేసుకుంది. ఓడలలో నుంచి సరుకులను కిందకు దించేందుకు ఉపయోగించే ఆఫ్ షోర్ క్రేన్లు రెండు కుప్పకూలాయి. ఈ ఘటనలో ఒకరు మృతిచెందగా.. మరో పది మందికి గాయాలయ్యాయి. శిథిలాల కింద మరికొంత మంది కార్మికులు చిక్కుకున్నారు.

ఈ ప్రమాదంలో మృతి చెందిన వ్యక్తిని పశ్చిమగోదావరి జిల్లా కొవ్వూరుకి చెందిన లక్ష్మణ్(35)గా గుర్తించారు. గాయపడిన పదిమందిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉంది. ఇటీవల సంభవంచిన తుపాను కారణంగా దెబ్బతిన్న క్రేన్ ను రిపేర్ చేస్తుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం స్థానిక ఆస్పత్రికి తరలించారు. 

PREV
click me!

Recommended Stories

Road Doctor: ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో రోడ్డు డాక్ట‌ర్‌.. దేశం దృష్టిని ఆక‌ర్షిస్తోన్న స‌రికొత్త సేవ‌లు
IMD Rain Alert : బంగాళాఖాతం మారిన వాతావరణం... ఈ ప్రాంతంలో ఇక చలివాన బీభత్సమే..!