జనసేనతో కలిసి పోటీ చేస్తాం..సీపీఎం

Published : Jan 11, 2019, 02:25 PM IST
జనసేనతో కలిసి పోటీ చేస్తాం..సీపీఎం

సారాంశం

త్వరలో రానున్న ఎన్నికల్లో తాము జనసేనతో కలిసి పోటీ చేయనున్నట్లు సీపీఎం రాష్ట్ర కార్యదర్శి మధు స్పష్టం చేశారు. 

త్వరలో రానున్న ఎన్నికల్లో తాము జనసేనతో కలిసి పోటీ చేయనున్నట్లు సీపీఎం రాష్ట్ర కార్యదర్శి మధు స్పష్టం చేశారు.  విశాఖలోని పార్టీ కార్యాలయంలో ఆయన ఈ రోజు విలేకరులతో మాట్లాడుతూ.. జనసేన అధినేత పవన్ పై ప్రశంసల వర్షం కురిపించారు.

పవన్ ప్రజలకు సేవ చేసేందుకు వచ్చారని.. తమ కూటమి ద్వారా ప్రత్యామ్నాయం తీసుకువస్తామని తెలిపారు. ఈ నెల 18, 19, 20 తేదీల్లో ఏ నియోజకవర్గం నుంచి ఎవరు పోటీ చేస్తారు అనే విషయంపై తాము చర్చించి.. ఆ తర్వాత అభ్యర్థుల జాబితాను విడుదల చేస్తామన్నారు. ఏపీలో టీడీపీకి ప్రజల్లో మద్దతు కరువైందన్నారు.

ఇటీవల జరిగిన ఎన్నికల్లో దేశవ్యాప్తంగా దళితులు బీజేపీకి వ్యతిరేకంగా ఓట్లు వేస్తున్నారన్నారు. అందుకనే అగ్రవర్ణ పేదలకు రిజర్వేషన్‌ను కేంద్రం చట్టం ద్వారా కల్పిస్తోందన్నారు. ప్రస్తుత తరుణంలో కూటముల వల్ల ప్రయోజనం లేదని, ఫెడరల్‌ ఫ్రంట్‌ వల్ల కూడా ఉపయోగం లేదన్నారు.

PREV
click me!

Recommended Stories

Road Doctor: ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో రోడ్డు డాక్ట‌ర్‌.. దేశం దృష్టిని ఆక‌ర్షిస్తోన్న స‌రికొత్త సేవ‌లు
IMD Rain Alert : బంగాళాఖాతం మారిన వాతావరణం... ఈ ప్రాంతంలో ఇక చలివాన బీభత్సమే..!