సీపీఎం నేత మధు అరెస్ట్

First Published Jul 12, 2018, 12:33 PM IST
Highlights

మధును అరెస్టు చేసే క్రమంలో నిరసనకారులు, పోలీసులకు మధ్య తోపులాట చోటుచేసుకుంది. వాహనాలు వెళ్లకుండా నిరసనకారులు రోడ్డుపై బైటాయించారు. నిరసనకారులను చెదరగొట్టేందుకు పోలీసులు లాఠీలకు పని చెప్పారు.

సీపీఎం రాష్ట్ర కార్యదర్శి మధు ని  పోలీసులు అరెస్ట్ చేశారు. పాతగుంటూరు పోలీస్‌స్టేషన్‌పై దాడి ఘటనకు సంబంధించి కొందరు అమాయకులపై పోలీసులు కేసులు పెట్టారంటూ బాధితులను పరామర్శించేందుకు మధు గుంటూరులో పర్యటించారు. దీంతో పోలీసులు ఆయన్ని అదుపులోకి తీసుకున్నారు.

 మధును అరెస్టు చేసే క్రమంలో నిరసనకారులు, పోలీసులకు మధ్య తోపులాట చోటుచేసుకుంది. వాహనాలు వెళ్లకుండా నిరసనకారులు రోడ్డుపై బైటాయించారు. నిరసనకారులను చెదరగొట్టేందుకు పోలీసులు లాఠీలకు పని చెప్పారు. కొందరు యువకులపై పోలీసులు చేయిు చేసుకున్నారు. ఈ ఘటనలో ఓ యువకుడు స్పృహ తప్పగా అతనిని ఆస్పత్రికి తరలించారు. 

అరెస్టు చేసిన వామపక్ష నాయకులు, కార్యకర్తలను నల్లపాడు పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. నగరంలో సెక్షన్ 30, 144 అమల్లో ఉన్నందున మహాధర్నాకు పోలీసులు అనుమతి నిరాకరించారు. పోలీసు అధికారులు నియంతృత్వంగా వ్యవహరిస్తున్నారంటూ వామపక్ష నాయకులు మండిపడ్డారు.

click me!