ప్రత్యేక హోదాపై జగన్‌కు రామకృష్ణ లేఖ

Published : Jun 25, 2019, 10:30 AM IST
ప్రత్యేక హోదాపై జగన్‌కు రామకృష్ణ లేఖ

సారాంశం

ప్రత్యేక హోదాపై కేంద్రం స్పష్టమైన ప్రకటన చేసిన నేపథ్యంలో  అఖిలపక్ష సమావేశాన్ని ఏర్పాటు చేయాలని సీపీఐ రాష్ట్ర సమితి కార్యదర్శి ఏపీ సీఎం వైఎస్ జగన్‌ను కోరారు.   

అమరావతి: ప్రత్యేక హోదాపై కేంద్రం స్పష్టమైన ప్రకటన చేసిన నేపథ్యంలో  అఖిలపక్ష సమావేశాన్ని ఏర్పాటు చేయాలని సీపీఐ రాష్ట్ర సమితి కార్యదర్శి ఏపీ సీఎం వైఎస్ జగన్‌ను కోరారు. 

ఏపీ సీఎం వైఎస్‌ జగన్‌కు సీపీఐ రాష్ట్ర సమితి కార్యదర్శి  రామకృష్ణ మంగళవారం నాడు లేఖ రాశారు. ఏపీ సహా ఏ రాష్ట్రానికి కూడ ప్రత్యేక హోదా ఇచ్చేది లేదని కేంద్ర ఆర్ధిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ లిఖిత పూర్వక సమాధానం ఇచ్చారు.

బీహార్ ఎంపీ అడిగిన ప్రశ్నకు ఆమె ఈ సమాధానం ఇచ్చారు.ప్రత్యేక హోదా ఏ రాష్ట్రానికి ఇచ్చేది లేదని కేంద్రం ప్రకటించిన నేపథ్యంలో అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేయాలని సీఎం జగన్‌ను రామకృష్ణ కోరారు. ప్రధానమంత్రి మోడీ వద్దకు అఖిలపక్షాన్ని తీసుకెళ్లాలని ఆయన కోరారు.  


 

PREV
click me!

Recommended Stories

సాయికృష్ణ ఇంటికి వద్ద జగన్ సంచలన ప్రెస్ మీట్ | YS Jagan Sensational Press Meet at Sai Krishna House
కృష్ణలంకలో గాదె సాయికృష్ణ కుటుంబాన్ని పరామర్శించిన జగన్ | YS Jagan Visits Gade Sai Krishna Family