రోడ్డు ప్రమాదంలోనే కారు డ్రైవర్ సుబ్రమణ్యం మరణించినట్టుగా ఎమ్మెల్సీ అనంత ఉదయ్ బాబు చెప్పారు.ఈ విషయమై కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చినట్టుగా ఎమ్మెల్సీ తెలిపారు.
కాకినాడ:రోడ్డు ప్రమాదంలోనే కారు డ్రైవర్ Subramanyam మరణించాడని YCP ఎమ్మెల్సీ Anantha Uday Babu అలియాస్ Uday Bhaskar అలియాస్ Anantha Babu వివరణ ఇచ్చారు. ఈ మేరకు ఆయన మీడియాకు ఓ ప్రకటన విడుదల చేశారు.
సుబ్రహ్మణ్యం తన దగ్గర ఐదేళ్లుగా Driver గా పనిచేస్తున్నాడన్నారు. రెండు నెలల నుంచి సుబ్రమణ్యం విధులకు సరిగా రావడం లేదని చెప్పారు. మద్యం అలవాటు ఉండటంతో టూవీలర్‌తో అనేకసార్లు యాక్సిడెంట్ చేసినట్టుగా ఆయన వివరించారు. సుబ్రమణ్యానికి గురువారం నాడు రాత్రి కూడా Road Accident జరిగిందన్నారు.
అయితే ఈ విషయమై కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చామన్నారు. చికిత్స కోసం Kakinada అమృత ఆసుపత్రికి తీసుకెళ్లామన్నారు. ఆసుపత్రికి సుబ్రమణ్యం తల్లిదండ్రులు కూడా వచ్చినట్టుగా ఆయన వివరించారు. సుబ్రమణ్యం డెడ్ బాడీని స్వగ్రామం తీసుకెళ్లేందుకు కారులో డెడ్ బాడీని అపార్ట్ మెంట్ వద్దకు పంపినట్టుగా ఎమ్మెల్సీ అనంతబాబు వివరణ ఇచ్చారు.