కేరళ తరహా ఘటనే: పొరపాటున నాటు బాంబు తిన్న ఆవుకు తీవ్ర గాయాలు

By narsimha lodeFirst Published Jun 29, 2020, 11:41 AM IST
Highlights

చిత్తూరు జిల్లాలో దారుణం చోటు చేసుకొంది. చిత్తూరు జిల్లాలో వేటగాళ్లు పెట్టిన నాటుబాంబును పొరపాటున తిన్న ఆవు తీవ్రంగా గాయపడింది. 
 


చిత్తూరు:చిత్తూరు జిల్లాలో దారుణం చోటు చేసుకొంది. చిత్తూరు జిల్లాలో వేటగాళ్లు పెట్టిన నాటుబాంబును పొరపాటున తిన్న ఆవు తీవ్రంగా గాయపడింది. చిత్తూరు జిల్లా  పెద్ద పంజని మండలం  కొకినేరు గ్రామంలోని ఓ మఠానికి చెందిన ఆవు మేత కోసం వెళ్లి పొరపాటున నాటుబాంబును తిని తీవ్రంగా గాయపడింది.

పొరపాటున నాటు బాంబును తినడంతో అది నోట్లోనే పేలిపోయింది. స్థానికులు వెంటనే గుర్తించి ఆవును ఆసుపత్రికి తరలించారు. పశువైద్యాధికారులు ఆవుకు చికిత్స నిర్వహించారు. 

కేరళ రాష్ట్రంలో కూడ ఇదే తరహాలోనే ఓ ఏనుగు కూడ పేలుడు పదార్ధాలు ఉన్న పైనాపిల్ తింది. సుమారు 20 రోజుల తర్వాత ఏనుగు మరణించిన విషయం తెలిసిందే. ఈ ఘటనలో ఒకరిని అరెస్ట్ చేశారు.

పంటలను కాపాడేందుకు నాటు బాంబులను ఈ ప్రాంతంలో వేటగాళ్లు ఉంచినట్టుగా స్థానికులు అనుమానిస్తున్నారు. ఈ ప్రాంతంలో ఆవులు, మేకలు మేత కోసం తిరుగుతుంటాయి. ఈ ప్రాంతంలో నాటు బాంబులను ఉంచడంపై స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రంలో గర్భంతో ఉన్న ఆవుకు పొరుగున ఉన్న వ్యక్తి పిండిలో నాటు బాంబు కలిపి తినిపించాడు. దీంతో ఆవు తీవ్రంగా గాయపడింది. ఈ ఘటనపై ఆవు యజమాని పోలీసులకు ఫిర్యాదు చేశాడు. 

click me!