గోదారోళ్లా? మజాకా?... సంక్రాంతి కొత్త అల్లుళ్లకు 365 వంటకాలతో ఆతిథ్యం..

By SumaBala BukkaFirst Published Jan 17, 2022, 9:12 AM IST
Highlights

సంక్రాంతి వచ్చిందంటే చాలు.. ఇంటికి వచ్చే అతిథులకు రకరకాల వంటలతో వడ్డించి మర్యాదలతో ముంచెత్తుతారు. ఒక కొత్త అల్లుళ్లకయితే.. ఆ మర్యాదల గురించి చెప్పక్కర్లేదు. అయితే... పశ్చిమ గోదావరిలో ఓ కుటుంబం తమ ఇంటికి కాబోయే అల్లుడికి 365 రకాల dishesతో ఆతిథ్యమిచ్చింది. 

నరసాపురం : sankranti festival వచ్చిందంటే కొత్త అల్లుళ్లకు పండగే పండగ.. ఇక ఆ అల్లుళ్లు గోదావరోళ్ల ఇంటి అల్లుళ్లైతే.. ఇక పంట పండినట్టే. మర్యాదలతో ముంచేస్తారు. రకరకాల వంటకాలతో తమ ఆతిథ్యాన్ని అంబరాన్నంటిస్తారు. అందుకే గోదారోళ్లు అంటే hospitality కి మారుపేరు. ఇక కొత్త అల్లుళ్లను మామూలుగా వదులుతారా?

అందులోనూ సంక్రాంతి వచ్చిందంటే చాలు.. ఇంటికి వచ్చే అతిథులకు రకరకాల వంటలతో వడ్డించి మర్యాదలతో ముంచెత్తుతారు. ఒక కొత్త అల్లుళ్లకయితే.. ఆ మర్యాదల గురించి చెప్పక్కర్లేదు. అయితే... పశ్చిమ గోదావరిలో ఓ కుటుంబం తమ ఇంటికి కాబోయే అల్లుడికి 365 రకాల dishesతో ఆతిథ్యమిచ్చింది. అన్నం, పులిహోర, బిర్యానీ, దద్దోజనం వంటి వంటకాలతో పాటు 30 రకాల కూరలు, వివిధ రకాల పిండివంటలు, 100రకాల స్వీట్స్, 19రకాల హాట్స్, 15 రకాల ఐస్ క్రీములు, 35 రకాల కూల్ డ్రింక్స్, 15 రకాల కేకులతో భోజనం పెట్టారు. 

మరో కుటుంబానికి చెందిన స్టీమర్ రోడ్డులోని మన్నే నాగేశ్వరరావు, అనంతలక్ష్మి దంపతుల కుమార్తె యశోదసాయికి మూడు నెలల క్రితం కృష్ణా జిల్లాకు చెందిన వినయ్ కుమార్ తో వివాహం అయ్యింది. పండుగకు అల్లుడిని పిలిచి 365 రకాల వంటకాలతో విందు ఏర్పాటు చేశారు. అల్లుడి వెంట వచ్చిన బంధువులకూ కొసరి కొసరి వడ్డించి తినిపించారు. 

వీటిలో 40 రకాల నాన్ వెజ్, 140 రకాల పిండివంటలు, 30 రకాల ఐస్ క్రీమ్ లు, 35 రకాల బిస్కెట్ లు, 25 రకాల పండ్లు, 30 రకాల వెజిటేరియన్ కూరలు, అన్నం, బిర్యానీ, దద్దోజనం తదితర వంటకాలున్నాయి. సొర, కొరమీను, వంజరం, కట్టెపరిగె, పండుగప్ప, సందువా తదితర రకాల చేపల కూరలు వడ్డించారు. చింతకాయ, పచ్చిరొయ్యలు, చింతచిగురు రొయ్యలు, చింతాకు, చిన్నచేపలు తదితర వంటలు వండారు. 

ఇక ఇదే పట్టణానికి చెందిన అత్యం మాధవి, వెంకటేశ్వరరావు దంపతుల కుమార్తె కుందవికి ఇటీవల తణుకు పట్టణానికి చెందిన ఎన్ఆర్ఐ సాయికృష్ణతో నిశ్చితార్థం జరిగింది. సంక్రాంతి సందర్బంగా కాబోయే అల్లుడిని ఇంటికి పిలిపించి 365 రకాల వంటలతో విందు ఏర్పాటు చేశారు. వీటిలో అన్నం, పులిహోర తదితరాలతో పాటు 30 రకాల కూరలు, 100 రకాల స్వీట్లు, 70 రకాల పిండి వంటలు, 19 రకాల హాట్, 19 రకాల ఐస్ క్రీమ్ లు, 35 రకాల కూల్ డ్రింక్స్, 15 రకాల కేకులున్నాయి. 

అరిటాకుతో 20మందికి భోజనం...
తూర్పు గోదావరి జిల్లా ఆలమూరు మండలం చెముడులంక శివారు గాంధీనగరంలో సంక్రాంతి సందర్బంగా 30 కుటుంబాలు కలిశాయి. పండుగను మూడు రోజులూ వేడుకగా జరుపుకున్నాయి. ప్రత్తి సత్యనారాయణ నివాసంలో జరిగిన ఈ వేడుకల్లో అతిపెద్ద అరిటాకును తయారుచేసి 20మంది సహపంక్తి భోజనం చేశారు. 

ఈ మర్యాదలతో ఆ కొత్త అల్లుళ్లు ఉబ్బితబ్బిబ్బయ్యారని కొత్తగా చెప్పాల్సిన పని లేదు కదా. అంతేనా ఈ మర్యాదల వార్త ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారింది. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. 

click me!