రోణంకి ర్యాంకుపై కోర్టులో కేసు

First Published Jun 27, 2017, 2:57 PM IST
Highlights

ఇప్పటి వరకూ సివిల్స్ సాదించిన ఎవ్వరి విషయంలోనూ తలెత్తని వివాదం తాజాగా రోణంకి విషయంలో వివాదాస్పదమైంది. మొదటి నుండి రోణంకి ఇంటర్వ్యూలు కూడా వివాదాస్పదమే. తను ఎవరి వద్ద కోచింగ్ తీసుకోలేదని చెప్పారు.

సివిల్స్ ఫలితాల్లో జాతీయస్ధాయిలో 3వ ర్యాంకు సాధించిన రోణంకి గోపాల కృష్ణ గుర్తున్నారు కదా? ఆయనిప్పుడు ఇబ్బందుల్లో పడ్డారు. 3వ ర్యాంకు సాధించిన విధానంపై రోణంకిపై కోర్టులో కేసు దాఖలైంది. తప్పుడు సర్టిఫికేట్లు పెట్టి రోణంకి సివిల్స్ లో 3వ ర్యాంకు సాధించారన్నది ఆయనపై అభియోగాలు. ఎం మురళీకృష్ణ అనే న్యాయవాది రోణంకిపై కేసు దాఖలు చేసారు. గోపాలకృష్ణకు అంగవైకల్యం లేకున్నా ఉన్నట్లుగా సర్టిఫికేట్ చూపించి మోసం చేసినట్లు న్యాయవాది ఆరోపిస్తున్నారు.

అంగవైకల్యం ఉన్న అభ్యర్ధులకు మిగిలిన అభ్యర్ధులకన్నా రాత పరీక్షలో గంటసేపు ఎక్కువ సమయం ఇస్తారు. అంగవైవకల్యం  సర్టిఫికేటూను చూపించి రోణంకి అర్థగంట ఎక్కువ సమయాన్ని తీసుకున్నాని కోర్టులు కేసు దాఖలు చేసారు. సర్టిఫికేట్లో చూపినట్లు రోణంకికి 45 శాతం అంగవైకల్యం లేదని న్యాయవాది వాదిస్తున్నారు. సమయం ఎక్కువ తీసుకోవటమే కాకుండా అర్హత మార్కుల్లో కూడా మిగిలిన వారికన్నా అంగవైకల్యం కోటాలో ఎక్కువ మార్కులు సాధించారు.

ఓబీసీలకు ప్రిలిమనరీలో అర్హతమార్కులు 110.66 అయితే, రోణంకికి వచ్చింది 91.34 మార్కులే. అయితే, వికలాగుంల కోటాలో అర్హత మార్కులు 75.34 అయినా  రోణంకి మెయిన్ పరీక్షలకు అర్హత సాధించాడు. ఇపుడు ఆ సర్టిపికేట్లే మోసమంటున్నారు న్యాయవాది. రోణంకి అంగవైకల్యంపై విచారణ జరిపితే పూర్తి వివరాలు బయటకు వస్తాయని న్యాయవాది కోర్టును కోరారు. రోణంకికి ఐఏఎస్ సర్వీసు కేటాయించకుండా మధ్యంతర ఉత్తర్వులు కూడా ఇవ్వాలని కోర్టును కోరారు. దాంతో కోర్టు రోణంకికి నోటీసులు జారీ చేసింది.

విచిత్రమేమిటంటే ఇప్పటి వరకూ సివిల్స్ సాదించిన ఎవ్వరి విషయంలోనూ తలెత్తని వివాదం తాజాగా రోణంకి విషయంలో వివాదాస్పదమైంది. మొదటి నుండి రోణంకి ఇంటర్వ్యూలు కూడా వివాదాస్పదమే. తను ఎవరి వద్ద కోచింగ్ తీసుకోలేదని చెప్పారు. అయితే,  సివిల్స్ అభ్యర్ధులకు కోచింగ్ ఇచ్చే మల్లవరపు బాలలత మాట్లాడుతూ రోణంకికి తాను కొన్ని అంశాల్లో కోచింగ్ ఇచ్చినట్లు చెప్పారు.

అయతే, టివి చర్చల్లో ఇద్దరూ కూర్చున్నపుడు కోచింగ్ ప్రస్తావన రావటంతో చివరకు బాలలత వద్ద కోచింగ్ తీసుకున్నట్లు అంగీకరిచారు. అదేవిధంగా, దళితుడి ఇంట్లో భోజనం చేసినందుకు తన కుటుంబాన్ని ఊరంతా వెలేసిందన్నారు. కానీ రోణంకి సివిల్స్ కు ఎంపికైన తర్వాత ఊరికి వెళ్ళినపుడు ఊరి ప్రజలు రోణింకిని బుజాన మోసుకుని ఊరేగించారు. దాంతో రోణంకి చెప్పేది ఏది నిజమో కూడా తెలియటం లేదు.

click me!