మాజీ మంత్రి కొల్లు రవీంద్రకు బెయిల్ మంజూరు

By narsimha lodeFirst Published Mar 11, 2021, 11:11 AM IST
Highlights

మాజీ మంత్రి కొల్లు రవీంద్ర కు కోర్టు గురువారం నాడు బెయిల్ మంజూరు చేసింది.
 

మచిలీపట్టణం: మాజీ మంత్రి కొల్లు రవీంద్ర కు కోర్టు గురువారం నాడు బెయిల్ మంజూరు చేసింది.

మున్సిపల్ ఎన్నికల సమయంలో పోలీసుల విధులకు ఆటంకం కల్గించారనే నెపంతో మాజీ మంత్రి కొల్లు రవీంద్రను గురువారం నాడు ఉదయం పోలీసులు అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపర్చారు.
కొల్లు రవీంద్రకు మేజిస్ట్రేట్ బెయిల్ మంజూరు చేశారు. 

 

కొల్లు రవీంద్ర కు కోర్టు గురువారం నాడు బెయిల్ మంజూరు చేసింది.మున్సిపల్ ఎన్నికల సమయంలో పోలీసుల విధులకు ఆటంకం కల్గించారనే నెపంతో మాజీ మంత్రి కొల్లు రవీంద్రను గురువారం నాడు ఉదయం పోలీసులు అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపర్చారు.
కొల్లు రవీంద్రకు మేజిస్ట్రేట్ బెయిల్ మంజూరు చేశారు. pic.twitter.com/sulDnPqNNj

— Asianetnews Telugu (@AsianetNewsTL)

రవీంద్ర అరెస్ట్ విషయంలో పోలీసులు  ప్రోసీజర్ ఫాలో కాలేదని న్యాయమూర్తి అభిప్రాయపడ్డారు.పోలీసుల విచారణకు సహకరించాలని రవీంద్రను  ఆదేశించారు జడ్జి.రూ. 60 వేల పూచీకత్తు, ఇద్దరి జామీనుతో న్యాయమూర్తి మాజీ మంత్రి కొల్లు రవీంద్రకు బెయిల్ మంజూరు చేశారు.

మున్సిపల్ ఎన్నికలు సాగుతున్న సమయంలో పోలీసులకు మాజీ మంత్రి కొల్లు రవీంద్రకు మధ్య వాగ్వాదం చోటు చేసుకొంది. తనను అడ్డగించారని పోలీసులతో రవీంద్ర వాగ్వాదానికి దిగారు. ఓ పోలీసు అధికారిని వెనక్కి నెట్టాడు.  నేలపై కూర్చొని నిరసనకు దిగాడు.

తమ విధులకు ఆటంకం కల్గించారని పోలీసులు ఆయనపై కేసు నమోదు చేశారు.ఈ కేసులో ఆయన ను ఇవాళ అరెస్ట్ చేశారు. ఈ కేసులో కోర్టు ఆయనకు బెయిల్ మంజూరు చేసింది.

click me!