విశాఖలో దంపతుల మిస్సింగ్ కలకలం.. ఆత్మహత్య చేసుకోబోతున్నట్టుగా సెల్పీ వీడియో..

Published : Mar 28, 2023, 09:25 AM IST
విశాఖలో దంపతుల మిస్సింగ్ కలకలం.. ఆత్మహత్య చేసుకోబోతున్నట్టుగా సెల్పీ వీడియో..

సారాంశం

విశాఖ జిల్లా దువ్వాడలో భార్యభర్తల మిస్సింగ్ ఘటన కలకలం రేపుతోంది. అయితే వారు  కనిపించకుండా పోవడానికి ముందు తాము ఆత్మహత్య చేసుకోబోతున్నట్టుగా ఓ సెల్పీ వీడియో రికార్డు చేశారు.

విశాఖ జిల్లా దువ్వాడలో భార్యభర్తల మిస్సింగ్ ఘటన కలకలం రేపుతోంది. అయితే వారు  కనిపించకుండా పోవడానికి ముందు తాము ఆత్మహత్య చేసుకోబోతున్నట్టుగా ఓ సెల్పీ వీడియో రికార్డు చేశారు. దీంతో వారి కుటుంబ సభ్యులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. వివరాలు.. స్టీల్ ప్లాంట్ ఉద్యోగి  వరప్రసాద్, అతని భార్యతో కలిసి కనిపించకుండా పోయాడు. అంతకు ముందుగా  ఓ సెల్పీ వీడియో రికార్డు చేశాడు. ఆర్థిక ఇబ్బందులతో ఆత్మహత్య చేసుకోబోతున్నామని అందులో పేర్కొన్నారు. పిల్లలు ధైర్యంగా ఉండాలని చెప్పారు. పిల్లలను జాగ్రత్తగా చూసుకోవాలని బంధువులను కోరారు.

ఆ వీడియోను వారి కుమారుడు కృష్ణ సాయితేజకు పంపిచారు. ఆ తర్వాత నుంచి వారి జాడ కనిపించలేదు. వారి ఫోన్‌లు కూడా స్విచ్చాఫ్‌ రావడంతో కుటుంబ సభ్యులు ఆందోళన చెందుతున్నారు. దీంతో వరప్రసాద్ కుమారుడు దువ్వాడ పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. అయితే అనకాపల్లి ఏటికొప్పాక ఏలూరు కాల్వ దగ్గర వరప్రసాద్ దంపతుల బ్యాగ్, చెప్పులు గుర్తించారు. దీంతో వారు ఆత్మహత్య చేసుకున్నారనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Chandrababu Speech: చంద్రబాబు సినిమా డైలాగ్ కి సభ మొత్తం అరుపులే | Asianet News Telugu
మండుటెండల్లో చంద్రబాబు.. వేమిరెడ్డి సూపర్ స్పీచ్ | Vemireddy Prabhakar Reddy Speech | Asianet Telugu