సీఎం వైఎస్ జగన్ క్యాంప్ ఆఫీస్ వద్ద దంపతుల ఆత్మహత్య యత్నం..

Published : May 19, 2021, 01:54 PM ISTUpdated : May 19, 2021, 01:56 PM IST
సీఎం వైఎస్ జగన్ క్యాంప్ ఆఫీస్ వద్ద దంపతుల ఆత్మహత్య యత్నం..

సారాంశం

తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయం వద్ద దంపతుల ఆత్మహత్య యత్నం కలకలం సృష్టించింది. కృష్ణా జిల్లాకు చెందిన దంపతులు ఆంధ్రప్రదేశ్ సీఎం వైఎస్ జగన్ క్యాంపు కార్యాలయం ముందు పెట్రోల్ పోసుకుని   ఆత్మహత్యయత్నం చేశారు.

తాడేపల్లిలోని సీఎం వైఎస్ జగన్ క్యాంపు కార్యాలయం వద్ద దంపతుల ఆత్మహత్య యత్నం కలకలం సృష్టించింది. కృష్ణా జిల్లాకు చెందిన దంపతులు ఆంధ్రప్రదేశ్ సీఎం వైఎస్ జగన్ క్యాంపు కార్యాలయం ముందు పెట్రోల్ పోసుకుని   ఆత్మహత్యయత్నం చేశారు.

తమ కుటుంబ ఆర్థిక పరిస్థితి సరిగా లేనందున సీఎం క్యాంపు కార్యాలయంకు వచ్చినట్టు ఆ దంపతులు తెలిపారు. వీరిని నరేష్, సరస్వతీగా గుర్తించారు. ఏం చేయాలో అర్థం కాక, బ్రతకడం వృధా అనిపించి ఆత్మహత్యయత్నం చేసినట్టు తెలిపారు. 

అయితే ఈ దారుణాన్ని సమయానికి గమనించిన పోలీసులు వీరి ప్రయత్నాన్ని అడ్డుకున్నారు. ఆ తరువాత దంపతులిద్దరినీ అదుపులోకి తీసుకుని తాడేపల్లి పోలీస్ స్టేషన్కు తరలించారు. 

PREV
click me!

Recommended Stories

IMD Cold Wave Alert : తెలుగు రాష్ట్రాల్లో టెంపరేచర్స్ కుప్పకూలడానికి .. చలి బీభత్సానికి కారణమేంటో తెలుసా?
Tirupati : టీటీడీలో మరో భారీ కుంభకోణం.. నకిలీ పట్టు వస్త్రాల పేరుతో రూ.55 కోట్ల మోసం