నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణంరాజును ప్రైవేట్ ఆసుపత్రికి తరలించాలనే తమ ఆదేశాలను ఎందుకు అమలు చేయలేదనే విషయమై ఏపీ హైకోర్టు జగన్ సర్కార్ కు నోటీసులు జారీ చేసింది.
అమరావతి: నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణంరాజును ప్రైవేట్ ఆసుపత్రికి తరలించాలనే తమ ఆదేశాలను ఎందుకు అమలు చేయలేదనే విషయమై ఏపీ హైకోర్టు జగన్ సర్కార్ కు నోటీసులు జారీ చేసింది. ఈ మేరకు జ్యూడిసీయల్ రిజిస్ట్రార్‌కి ఏపీ హైకోర్టు బుధవారం నాడు ఆదేశాలు జారీ చేసింది. మధ్యాహ్నం 12 గంటలకు మెడికల్ రిపోర్టు ఇవ్వాలని ఆదేశించినా కూడ సాయంత్రం ఆరు గంటల వరకు ఎందుకు ఇవ్వలేదో చెప్పాలని కోర్టు ప్రశ్నించింది. ఈ విషయమై కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. పౌరుల ప్రాథమిక హక్కులకు భంగం కలిగినప్పుడు కోర్టులు స్పందిస్తాయని ఉన్నత న్యాయస్థానం వ్యాఖ్యానించింది.
&n
నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణంరాజును ప్రైవేట్ ఆసుపత్రికి తరలించాలనే తమ ఆదేశాలను ఎందుకు అమలు చేయలేదనే విషయమై ఏపీ హైకోర్టు జగన్ సర్కార్ కు నోటీసులు జారీ చేసింది. pic.twitter.com/i3gesoZjW1
— Asianetnews Telugu (@AsianetNewsTL)
undefined
bsp;
రఘురామకృష్ణంరాజు తరపున లాయర్లు దాఖలు చేసిన పిటిషన్లపై బుధవారం నాడు కోర్టు విచారణ నిర్వహించింది. హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులను ఎందుకు అమలు చేయలేదని ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. ప్రభుత్వంపై సుమోటోగా కోర్టు ధిక్కరణ కింద నోటీసులు జారీ చేయాలని జ్యూడిసీయల్ రిజిస్ట్రార్‌కి ఏపీ హైకోర్టు ఆదేశించింది. సీఐడీ అడిషనల్ డీజీ సునీల్ కుమార్ తో పాటు స్టేషన్ హౌజ్ ఆపీసర్‌కి నోటీసులు ఇవ్వాలని హైకోర్టు కోరింది.
also read:టీ హైకోర్టు నుంచి సుప్రీంకు రఘురామ వైద్య పరీక్షల నివేదిక: కుమారుడికి నో ఎంట్రీ
గుంటూరు సీఐడీ కోర్టు ఆదేశాలు నిబంధనలకు విరుద్దమని అదనపు అడ్వకేట్ జనరల్ హైకోర్టులో వాదించారు. కోర్టు ఆదేశాలు 11 గంటలకు అందడం వల్లే అమలు చేయలేకపోయినట్టుగా ఏఏజీ హైకోర్టు దృష్టికి తీసుకొచ్చారు. ఈ విషయాన్ని తమ దృష్టికి ఎందుకు తీసుకురాలేదని హైకోర్టు ప్రశ్నించింది. ఏఏజీ వ్యాఖ్యల్ని న్యాయస్థానం తప్పుబట్టింది.