ప్రకాశం జిల్లా సైదాపురంలోని రైల్వేట్రాక్ పై రెండు మృతదేహలు కన్పించాయి. వీరిద్దరూ ఆత్మహత్య చేసుకున్నారని పోలీసులు అనుమానిస్తున్నారు.
ఒంగోలు: ప్రకాశం జిల్లా సైదాపురంలో ని రైల్వే ట్రాక్ పై మంగళవారంనాడు ఉదయం రెండు మృతదేహలు కన్పించాయి. వీరిద్దరూ ఆత్మహత్య చేసుకున్నారని పోలీసులు అనుమానిస్తున్నారు. మృతి చెందినవారు భార్యాభర్తలా, ప్రేమికులా అనే విషయం కూడా స్పష్టత రావాల్సి ఉంది. మృతదేహల సమీపంలో కూల్ డ్రింక్ , కొబ్బరి బొండాలున్నాయి.
చిన్న చిన్న సమస్యలకే ఆత్మహత్యలు చేసుకుంటున్న ఘటనలు దేశ వ్యాప్తంగా చోటు చేసుకుంటున్నాయి. సమస్యలు వచ్చిన సమయంలో వాటిని ధైర్యంగా ఎదుర్కోవాలి. కానీ సమస్యలు వచ్చాయని ఆత్మహత్యలు చేసుకోవద్దని మానసిక వైద్యులు సూచిస్తున్నారు. చిన్న చిన్న కారణాలకే ఆత్మహత్యలు చేసుకోవడం సరైంది కాదని మానసిక వైద్యులు చెబుతున్నారు.
మానసిక ఒత్తిడికి గురైన వారు వైద్యులను సంప్రదించి చికిత్స తీసుకోవాలి. జీవితంలోని ప్రతి సమస్యకు చావు ఒక్కటే పరిష్కారం కాదు. జీవితంలో మీకెప్పుడైనా మానసిక ఒత్తిడితో బాధపడుతూ సహాయం కావాలనిపిస్తే వెంటనే ఆసరా హెల్ప్ లైన్ ( +91-9820466726 ) కి కాల్ చేయండి లేదా ప్రభుత్వ హెల్ప్ లైన్ కి కాల్ చేయండి. జీవితం చాలా విలువైనది.చిన్న చిన్న విషయాలకు ఆత్మహత్యలు చేసుకోని కుటుంబ సభ్యులకు దు:ఖాన్ని మిగల్చవద్దని మానసిక వైద్యులు సూచిస్తున్నారు.