వీడిన కొత్తశానంబట్ల మంటల మిస్టరీ.. కార‌ణ‌మేంటంటే..?

By Mahesh RajamoniFirst Published May 22, 2023, 5:31 PM IST
Highlights

Tirupati : కొత్తశానంబట్ల గ్రామ మంటల మిస్టరీ వీడింది. ఎప్పుడు ఎక్క‌డ మంట‌లు మండుకుంటాయోన‌ని భయభ్రాంతులతో బిక్కుబిక్కుమంటూ అక్కడి ప్రజలు గడిపారు. ఆ ఊరిలో జ‌రిగే అగ్ని ప్ర‌మాదాలు  రెండు తెలుగు రాష్ట్రాల్లో సంచ‌ల‌నంగా మారాయి. తాజాగా ఈ మిస్ట‌రీని పోలీసులు ఛేధించారు.  

Tirupati Kothasanambatla Mystery: కొత్తశానంబట్ల గ్రామ మంటల మిస్టరీ వీడింది. ఎప్పుడు ఎక్క‌డ మంట‌లు మండుకుంటాయోన‌ని భయభ్రాంతులతో బిక్కుబిక్కుమంటూ అక్కడివారు గడిపారు. ఆ ఊరిలో జ‌రిగే అగ్ని ప్ర‌మాదాలు  రెండు తెలుగు రాష్ట్రాల్లో సంచ‌ల‌నంగా మారాయి. ఈ మిస్ట‌రీని పోలీసులు ఛేధించారు. ఆకతాయిల పనిగా ప్రారంభ‌మై.. ప్రతీకార చర్యగా కొనసాగిందని నిర్ధారించారు. చంద్రగిరి మండలం కొత్తశానంభట్ల గ్రామం లో మంటల మిస్టరీ సంచ‌ల‌నంగా మారింది. దీనిని ఛేధించిన పోలీసులు సంబంధిత వివ‌రాలను వెల్ల‌డిస్తూ.. కొంత‌మంది ఆకతాయిలు మొద‌ట ఓ గడ్డివాముకు నిప్పు పెట్టారు. అలాగే, బంధువులపై విద్వేషంతో ఉన్న కీర్తి అనే మహిళ.. తొలుత ఎదురింట్లో గడ్డివాముకు నిప్పు పెట్టింది. ఆ తర్వాత అగ్గిపుల్ల‌ల‌తో వరుసగా బంధువుల ఇళ్లలో నిప్పు పెడుతూ గ్రామంలో భ‌య‌భ్రాంతులు సృష్టించిన‌ట్టు పోలీసులు గుర్తించిన‌ట్టు తెలిపారు. 

అగ్నిప్ర‌మాదాలు వ‌రుస‌గా జ‌ర‌గ‌డంతో సంచ‌ల‌నంగా మార‌డంతో పాటు స్థానికంగా భ‌యాందోళ‌న‌లు మొద‌ల‌య్యాయి. అయితే, ఈ అగ్నిప్ర‌మాదాల వ‌ల్ల నష్టపోయివారికి కొందరు ఆర్థిక సాయం అందించ‌డం చూసి.. ప‌లువ‌రు అత్యాశతో కావాలనే తమ ఇళ్లలో నిప్పు పెట్టుకున్నారు. ఇలా గ్రామ ప్ర‌జ‌ల‌ను భయభ్రాంతులకు గురిచేసిన వారిని అదుపులోకి తీసుకున్నారు. కొత్తశానంభట్ల గ్రామంలో మొద‌ట పిల్లపాలెం అన్నదమ్ములకు సంబంధించిన నాలుగు ఇళ్లలో, వారి పొలాల్లో మంట‌లు అంటుకున్నాయి. ఇతరుల ఇళ్లలోనూ మంటలు వ్యాపించాయి. గ్రామంలో భ‌యాందోళ‌న‌లు నెల‌కొన‌డంతో రంగంలోకి దిగిన పోలీసు క్లూ టీం ఆధారాలు సేకరిస్తూ ఈ మిస్ట‌రీని ఛేధించింది.

click me!