వారి వల్లనే కేసులు ఎక్కువ, వీరికి సెల్యూట్: వైఎస్ జగన్

Published : Apr 10, 2020, 02:30 PM IST
వారి వల్లనే కేసులు ఎక్కువ, వీరికి సెల్యూట్: వైఎస్ జగన్

సారాంశం

ఢిల్లీ నుంచి వచ్చినవారి వల్లనే రాష్ట్రంలో కరోనా వైరస్ కేసులు పెరిగాయని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అన్నారు. వైద్యులు ఉత్తమ సేవలు అందిస్తున్నారని, వారికి సెల్యూట్ చేస్తున్నానని జగన్ అన్నారు.

అమరావతి: ఢిల్లీలోని నిజాముద్దీన్ ప్రాంతంలో జరిగిన మత ప్రార్థనల్లో పాల్గొని వచ్చినవారి వల్లనే రాష్ట్రంలో కేసులు ఎక్కువగా నమోదయ్యాయని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అన్నారు. రాష్ట్రంలో పరిస్థితి అదుపులోనే ఉందని చెప్పవచ్చునని ఆయన అన్నారు. కరోనా వైరస్ మీద ఆయన శుక్రవారం సమీక్ష జరిపారు.

కొద్ది రోజుల్లో సాధారణ పరిస్థితులు నెలకొంటాయని భావిస్తున్నట్లు తెలిపారు. విపత్కర పరిస్థితిలో వైద్యులు ప్రశంసనీయమైన సేవలు అందిస్తున్నారని, వారికి సెల్యూట్ చేస్తున్నానని ఆయన చెప్పారు.  నాలుగు క్రిటికిల్ కేర్ ఆస్పత్రుల్లో ఉత్తమ వైద్య సేవలు అందిస్తున్న విషయాన్ని గుర్తించామని ఆయన అన్నారు. 

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గత 12 గంటల్లో రెండు కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. అనంతపురం జిల్లాలో ఈ రెండు కేసులు రికార్డయ్యాయి. గత 24 గంటల్లో 892 మందికి పరీక్షలు నిర్వహించగా 17 మందికి కరోనా పాజిటివ్ సోకినట్లు తేలింది. దీంతో రాష్ట్రంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 365కు చేరుకుంది.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా మరణాల సంఖ్య ఆరుకు చేరుకుంది. గురువారంనాడు అనంతపురం జిల్లాలోని మనురేవుకు చెందిన 70 ఏల్ల వ్యక్తి కరోనా వైరస్ బారిన పడి మరణించాడు. గుంటూరులోని ఎన్ఆర్ పేటకు చెందిన 45 ఏళ్ల వ్యక్తి కూడా మరణించాడు. దీంతో ఏపీలో మరణాల సంఖ్య ఆరుకు చేరుకుంది.

గురువారంనాడు 363 కరోనా పాజిటివ్ కేసులు ఉండగా ప్రస్తుతం 365కు చేరుకున్నాయి. గురువారం ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు 15 కేసులు నమోదయ్యాయి. గురువారంనాడు కొత్తగా ప్రకాశం జిల్లాలో 11, గుంటూరు జిల్లాలో 2 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 

తూర్పు గోదావరి, కడప జిల్లాలో ఒక్కో కేసులు నమోదయ్యాయి. కరోనా వైరస్ కు చికిత్స పొంది ఇప్పటి వరకు పది మంది డిశ్చార్జీ అయ్యారు. అత్యధికంగా కర్నూలు జిల్లాలో అత్యధికంగా 75 కేసులు నమోదయ్యాయి. 

విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల్లో కరోనా పాజిటివ్ కేసులు ఏవీ నమోదు కాలేదు.

జిల్లాలవారీగా కరోనా పాజిటివ్ కేసులు ఇవీ...

అనంతపురం 15
చిత్తూరు 20
తూర్పుగోదావరి 12
గుంటూరు 51
కడప 29
కృష్ణా 35
కర్నూలు 75
నెల్లూరు 48
ప్రకాశం 38
విశాఖపట్నం 20
పశ్చిమ గోదావరి 22

PREV
click me!

Recommended Stories

Perni Nani press meet: మోయ‌లేని గుదిబండగా అమ‌రావ‌తి చంద్రబాబుపై పేర్నినాని సెటైర్లు | Asianet Telugu
Raghurama KrishnamRaju: మావాళ్లని మోసం చేయొద్దు | Update on Akividu Ramalayam | Asianet News Telugu