కృష్ణా జిల్లాలో స్ట్రెయిన్ కలకలం: యూకే నుంచి 116 మంది.. ట్రేసింగ్‌‌లో అధికారులు

By Siva Kodati  |  First Published Dec 25, 2020, 3:14 PM IST

ప్రస్తుతం ప్రపంచాన్ని కలవరపాటుకు గురిచేస్తున్న స్ట్రెయిన్ 70 భారతదేశంలోకి రాకుండా కేంద్ర ప్రభుత్వంతో పాటు రాష్ట్రాలు అప్రమత్తమయ్యాయి. అయితే ఇప్పటికే మార్పు చెందిన కొత్త రకం కరోనా వైరస్ ఇండియాలోకి ప్రవేశించినట్లు నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు


ప్రస్తుతం ప్రపంచాన్ని కలవరపాటుకు గురిచేస్తున్న స్ట్రెయిన్ 70 భారతదేశంలోకి రాకుండా కేంద్ర ప్రభుత్వంతో పాటు రాష్ట్రాలు అప్రమత్తమయ్యాయి. అయితే ఇప్పటికే మార్పు చెందిన కొత్త రకం కరోనా వైరస్ ఇండియాలోకి ప్రవేశించినట్లు నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

యూకే నుంచి భారత్‌కు వచ్చిన కొందరికి పాజిటివ్‌గా తేలడంతో దేశంలో మరోసారి లాక్‌డౌన్ తప్పదేమోనన్న చర్చ మొదలైంది. తాజాగా కృష్ణా జిల్లాల్లో స్ట్రెయిన్ కలకలం రేపుతోంది.

Latest Videos

undefined

బ్రిటన్ నుంచి జిల్లాకు 116 మంది వచ్చినట్టు ప్రభుత్వ యంత్రాంగం గుర్తించింది. విజయవాడ కొత్త ప్రభుత్వ ఆసుపత్రిలో 300 బెడ్లు ఏర్పాటు చేశారు.  150 కోవిడ్.. మరో 150 నాన్ -కోవిడ్ బెడ్లను ఏర్పాటు చేశారు.

యూకే నుంచి వచ్చిన వారి కోసం వీటిని ఏర్పాటు చేశారు. పరీక్షల అనంతరం పరిశీలించి ప్రత్యేక విభాగాల ఏర్పాటుకు ఏర్పాట్లు చేస్తున్నారు. క్వారంటైన్ సెంటర్లకు, ఐసోలేషన్ కేంద్రాలకు తరలిస్తున్నారు.

మరోవైపు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల హెచ్చరికలతో జిల్లా యంత్రాంగం అప్రమత్తమైంది. ఏపీ ఎక్స్‌ప్రెస్‌లో ప్రయాణించి మచిలీపట్నానికి చేరుకున్న వారి వివరాలు స్వీకరించనున్నారు. కృష్ణా జిల్లా గూడవల్లి క్వారంటైన్ సెంటర్‌తో పాటు ఈడ్పుగల్లులో గతంలో వున్న క్వారంటైన్ సెంటర్‌ను సైతం పున: ప్రారంభించారు.

click me!