శ్రీకాకుళంలో తొలి కరోనా మరణం, ఉలిక్కిపడ్డ అధికారులు

By Siva KodatiFirst Published Jun 17, 2020, 5:16 PM IST
Highlights

భారతదేశంలో కరోనా వైరస్ వ్యాప్తి మొదలైన నాటి నుంచి గ్రీన్ జోన్‌గా ఉంటూ వస్తున్న శ్రీకాకుళం జిల్లాలో ప్రస్తుతం కోవిడ్ 19 విజృంభిస్తోంది. ఈ క్రమంలో జిల్లాలో వైరస్ కారణంగా తొలి మరణం సంభవించింది

భారతదేశంలో కరోనా వైరస్ వ్యాప్తి మొదలైన నాటి నుంచి గ్రీన్ జోన్‌గా ఉంటూ వస్తున్న శ్రీకాకుళం జిల్లాలో ప్రస్తుతం కోవిడ్ 19 విజృంభిస్తోంది. ఈ క్రమంలో జిల్లాలో వైరస్ కారణంగా తొలి మరణం సంభవించింది.

మందసలో కరోనాతో బాధపడుతున్న 37 ఏళ్ల యువకుడు బుధవారం చికిత్స  పొందుతూ మరణించాడు. దీంతో అప్రమత్తమైన అధికారులు మందసను కంటైన్‌మెంట్ జోన్‌గా ప్రకటించారు.

Also Read:ఏపీలో కరోనా విజృంభణ: 7 వేలు దాటిన పాజిటివ్ కేసులు, 90 మంది మృతి

అలాగే జిల్లా కలెక్టర్ జె. నివాస్ .. మందస వెళ్లి పరిస్ధితిని సమీక్షించనున్నారు. కాగా మరణించిన వ్యక్తికి ఎలాంటి ట్రావెల్ హిస్టరీ లేదని, కేవలం సంక్రమణ ద్వారానే అతడికి కోవిడ్ 19 వ్యాపించిందని అధికారులు వెల్లడించారు.

కాగా ఇప్పటి వరకు శ్రీకాకుళం జిల్లాలో 400 కరోనా వైరస్ కేసులు నమోదయ్యాయి. ఇందులో 271 యాక్టివ్ కేసులున్నాయి. కేసుల తీవ్రత దృష్ట్యా ఒక్క శ్రీకాకుళం పట్టణంలోనే 10 కంటైన్‌మెంట్ జోన్లు ఏర్పాటు చేశారు. మరోవైపు గడిచిన 24 గంటల్లో భారతదేశంలో 2003 మంది మరణించడంతో మన దేశంలో మొత్తం మృతుల సంఖ్య 11,903కి చేరుకుంది. 

click me!