మండలిలో మూడు రాజధానుల బిల్లు, జగన్ వ్యూహం ఇదీ....

By Sreeharsha GopaganiFirst Published Jun 17, 2020, 5:01 PM IST
Highlights

ఇకపోతే... మూడు రాజధానుల అంశం గతంలోనే సెలెక్ట్ కమిటీ కి పంపినప్పటికీ... మరల ఇప్పుడు ఎందుకు పునఃప్రవేశపెడుతున్నారని టీడీపీ ప్రశ్నించింది. ఇది సాధారణంగా అందరికి వచ్చే ప్రశ్నే. 

కౌన్సిల్ లో నేడు మూడు రాజధానులకు సంబంధించిన బిల్లుపై చర్చ జరుగుతున్న విషయం తెలిసిందే. కొద్దీ సేపటి విరామం తరువాత మండలి తిరిగి ప్రారంభమయింది. మండలిలో ఉదయం నుండి వాడి వేడిగా చర్చలు నడుస్తున్న విషయం తెలిసిందే. 

ఇకపోతే... మూడు రాజధానుల అంశం గతంలోనే సెలెక్ట్ కమిటీ కి పంపినప్పటికీ... మరల ఇప్పుడు ఎందుకు పునఃప్రవేశపెడుతున్నారని టీడీపీ ప్రశ్నించింది. ఇది సాధారణంగా అందరికి వచ్చే ప్రశ్నే. 

సెలెక్ట్ కమిటీ దగ్గర బిల్లు ఉన్నప్పటికీ అధికార వైసీపీ దానిని తిరిగి ప్రవేశపెట్టింది. జగన్ సర్కార్ ఇలా బిల్లును ప్రవేశపెట్టడానికి కారణం లేకపోలేదు. సాధారణంగా ఒక బిల్లును మండలి తిప్పి పంపితే... దాన్ని అసెంబ్లీ మరల మండలికి పంపిస్తే...ఎం మండలి ఏమీ చేయలేదు. మండలి బిల్లును రిజెక్ట్ చేసిన కూడా బిల్లు పాసయినట్టుగా పరిగణిస్తారు. 

అందుకోసమనే నిన్న మరోసారి బిల్లును అసెంబ్లీలో ప్రవేశపెట్టారు. బడ్జెట్ సమావేశాలు కేవలం రెండు రోజులే ఉండడంతో నేడు మండలి బిల్లుకు ఆమోదం తెలపడమో లేక దాన్ని తిరస్కరించడమో చేయాలి. తరస్కరించిన బిల్ డీమ్డ్ టు బి పాస్డ్ గా వ్యవహరిస్తారు. ఒకవేళ ఏమీ చేయకుండా వదిలేసినా మహా అయితే నెల రోజులు మాత్రమే దాన్ని ఆపగలుగుతారు. అంతకు మించి దాన్ని ఆలస్యం చేయలేరు. 

ఈ అన్ని పరిస్థితులను బేరీజు వేసుకొనే ప్రభుత్వం నిన్న ఈ బిల్లులను ప్రవేశపెట్టినట్టు తెలియవస్తుంది. ఇకపోతే... ఈ విషయం మరోసారి కోర్టు  కనబడుతోంది. సెలెక్ట్ కమిటీకి పంపిన బిల్లును మరల ప్రవేశపెట్టవచ్చా అన్న ప్రశ్నకు కోర్టులే సమాధానం చెప్పాలి. 

ఇకపోతే... టీడీపీ ఎమ్మెల్సీలతో ఆ పార్టీ సీనియర్ నేత యనమల రామకృష్ణుడు భేటీ అయ్యారు. రూల్ 90 కింద అవసరమైతే ఓటింగుకు టీడీపీ పట్టుబట్టే అవకాశం కూడా ఉన్నట్టు తెలియవస్తుంది. 

తమ పార్టీ సభ్యులంతా పార్టీ నిర్ణయానికి అనుగుణంగా వ్యవహరిస్తారని టీడీపీ ధీమా వ్యక్తం చేస్తున్నప్పటికీ... వైసీపీ మైండ్ గేమ్ ఎమన్నా ఆడుతుందా అని కూడా ఆందోళన చెందుతున్నారు. 

తమ పార్టీకి 28 మంది ఎమ్మెల్సీల బలం ఉందని టీడీపీ చెబుతోంది. తాను వైసీపీలో చేరుతాను అనిచెప్పి పార్టీ కార్యకలాపాలకు దూరంగా ఉంటున్న కేఈ ప్రభాకర్‌తో టీడీపీ పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు మాట్లాడారు. 

ఆయనతో చర్చలు సఫలంగా ముగిశాయని తెలియవస్తుంది. చిన్న చిన్న మనస్పర్థలే తప్ప పెద్ద సమస్యలేవీ లేవని ఆయన అన్నట్టుగా టీడీపీ వర్గాలు తెలుపుతున్నాయి. 

ఇకపోతే... టీడీపీ ఎమ్మెల్సీలు శమంతకమణి, పోతుల సునీత, శివనాధ్ రెడ్డిలకు టీడీపీ మండలి విప్ బుద్ధా వెంకన్న ఇప్పటికే విప్ జారీ చేసిన విషయం తెలిసిందే. 

షెడ్యూల్ సమయం కంటే 11 నిమిషాలు ఆలస్యంగా ఏపీ శాసనమండలి ప్రారంభమైంది.  శాసనమండలి సమావేశం ప్రారంభం కాగానే సీఆర్‌డీఏ రద్దు బిల్లు, ఏపీ పాలనా వికేంద్రీకరణ బిల్లులు  మండలి ముందుకు వచ్చినట్టుగా మండలి ఛైర్మెన్ ఎంఏ షరీఫ్ ప్రకటించారు.

click me!