ఏపీలో కరోనా మృత్యుఘోష: ఒక్క రోజులో 43 మంది మృతి, 1916 కేసులు

By telugu teamFirst Published Jul 14, 2020, 2:18 PM IST
Highlights

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా వైరస్ మృత్యుఘోష వినిపిస్తోంది. ఒక్క రోజులో ఏపీలో కరోనా వైరస్ తో 43 మంది మరణించారు. దాంతో కోవిడ్ -19 మరణాల సంఖ్య 400 మార్కును దాటింది.

అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా వైరస్ విలయతాండవం చేస్తోంది. కోవిడ్ -19 మరణాల సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. గత 24 గంటల్లో కొత్తగా ఏపీలో 43 మంది కరోనాతో మరణించారు. తాజాగా అనంతపురం జిల్లాలో పది మంది, పశ్చిమ గోదావరి జిల్లాలో 9 మంది కరోనాతో మరణించారు. తూర్పు గోదావరి, కడప జిల్లాల్లో ఐదుగురేసి మరణించారు. కర్నూలు, ప్రకాశం జిల్లాల్లో ముగ్గురేసి మృత్యువాత పడ్డారు. ప్రకాశం జిల్లాలో ముగ్గురు, విశాఖపట్నం జిల్లాలో ఇద్దరు, విజయనగరం జిల్లాలో ఒకరు చనిపోయారు. దీంతో ఏపీలో కరోనా వైరస్ తో మరణించినవారి సంఖ్య 408కి చేరుకుంది. ఒక్క కర్నూలు జిల్లాలోనే 108 మంది మృత్యువాత పడ్డారు. 

కాగా, గత 24 గంటల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 1916 మందికి కరోనా పాజిటివ్ నిర్ధారణ అయింది. రాష్ట్రానికి చెందినవారిలో 1908 మందికి కరోనా సోకగా, ఇతర రాష్ట్రాల నుంచి వచ్చినవారిలో గత 24 గంటల్లో 8 మందికి కరోనా వైరస్ సోకింది. దీంతో ఇతర రాష్ట్రాల నుంచి వచ్చినవారిలో 2424 మందికి కరోనా వైరస్ పాజిటివ్ నిర్ధారణ అయింది. విదేశాల నుంచి వచ్చినవారిలో గత 24 గంటల్లో ఎవరికి కూడా కరోనా వైరస్ సోకలేదు. విదేశాల నుంచి వచ్చినవారిలో ఇప్పటి వరకు 432 మంది కరోనా వైరస్ తో బాధపడుతున్నారు.  

తాజాగా గత 24 గంటల్లో చిత్తూరు జిల్లాలో అత్యధికంగా కేసులో నమోదయ్యాయి. చిత్తూరు జిల్లాలో 238 కరోనా వైరస్ కేసులు నమోదు కాగా, శ్రీకాకుళం జిల్లాలో 215 కేసులు నమోదయ్యాయి. తాజాగా గత 24 గంటల్లో అనంతపురం జిల్లాలో 185, తూర్పు గోదావరి జిల్లాలో 160, గుంటూరు జిల్లాలో 146, కడప జిల్లాలో 112, కృష్ణా జిల్లాలో 129 కేసులు నమోదయ్యాయి. 

కర్నూల జిల్లాలో 169, నెల్లూరు జిల్లాలో 165, ప్రకాశం జిల్లాలో 32, విశాఖపట్నం జిల్లాలో 28, విజయనగరం జిల్లాలో 130, పశ్చిమ గోదావరి జిల్లాలో 199 కేసులు నమోదయ్యాయి. గత 24 గంటల్లో 22,670 శాంపిల్సును పరీక్షించగా రాష్ట్రానికి చెందినవారిలో 1,908 మందికి కరోనా పాజిటివ్ నిర్ధారణ అయింది. 

ఏపీలో జిల్లాలవారీగా మొత్తం కరోనా పాజిటివ్ కేసులు, మరణాలు

అనంతపురం 3651, మరణాలు 40
చిత్తూరు 3074, మరణాలు మరణాలు 29
తూర్పు గోదావరి 3115, మరణాలు 17
గుంటూరు 3356, మరణాలు 32
కడప 1982, 1982, మరణాలు 12
కృష్ణా 2744, మరణాలు 83
కర్నూలు 3823, మరణాలు 108
నెల్లూరు 1419, మరణాలు 12
ప్రకాశం 1238, మరణాలు 11
శ్రీకాకుళం 1414, మరణాలు14
విశాఖపట్నం 1489, మరణాలు 18
విజయనగరం 832, మరణాలు 9
పశ్చిమ గోదావరి 2025, మరణాలు 23

 

: 14/07/2020, 10:00 AM
రాష్ట్రం లోని నమోదైన మొత్తం 30,163 పాజిటివ్ కేసు లకు గాను
*15,227 మంది డిశ్చార్జ్ కాగా
*408 మంది మరణించారు
* ప్రస్తుతం చికిత్స పొందుతున్నవారి సంఖ్య 14,528 pic.twitter.com/EgM55KDUqc

— ArogyaAndhra (@ArogyaAndhra)
click me!