ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా వైరస్ కేసుల సంఖ్య 402కు చేరుకుంది. శుక్రవారం రాత్రి 9 గంటల నుంచి శనివారం ఉదయం వరకు 21 కొత్త కేసులు నమోదయ్యాయి. మొత్తం ఆరుగురు మరణించారు.
అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా వైరస్ కోరలు సాచింది. తాజాగా 21 కేసులు నమోదయ్యాయి. శుక్రవారం రాత్రి 9 గంటల నుంచి శనివారం ఉదయం వరకు ఆ కేసులు నమోదయ్యాయి. దాంతో రాష్ట్రంలో కరోనా వైరస్ కేసుల సంఖ్య 402కు చేరుకుంది.
కొత్తగా కర్నూలులో 5 కేసులు నమోదయ్యాయి. దీంతో కర్నూలు జిల్లాలో కరోనా వైరస్ కేసుల సంఖ్య 82కు చేరుకుంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అత్యధికంగా కరోనా కేసులు కర్నూలు జిల్లాలోనే నమోదయ్యాయి. కొత్తగా ప్రకాశం, కడప జిల్లాల్లో ఒక్కో కేసు నమైంది.
గత 24 గంటల్లో రాష్టర్ంలో మొత్తం 909 మందికి కరోనా వైరస్ పరీక్షలు నిర్వహించారు. వారిలో 37 మందికి పాజిటివ్ ఉన్నట్లు తేలింది. రాష్ట్రంలో నమోదైన మొత్తం 402 మంది కరోనా పాజిటివ్ రోగుల్లో 11 మంది డిశ్చార్జి అయ్యారు. ఆరుగురు మరణించారు. అనంతపురం జిల్లాలో ఇద్దరు, కృష్ణా జిల్లాలో ఇద్దరు, గుంటూరు, కర్నూలు జిల్లాల్లో ఒక్కరేసి మృత్యువాత పడ్డారు. ఆస్పత్రులో ప్రస్తుతం 385 మంది చికిత్స పొందుతున్నారు. శ్రీకాకుళం, విజయనగరం జిల్లాలో కరోనా వైరస్ కు దూరంగా ఉన్నాయి.
గుంటూరు జిల్లాలో ఈ రోజు ఒక్క రోజే 14 కరోనా వైరస్ పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 14 మంది కరోనా వైరస్ రోగుల్లో నలుగురు చిన్నారులు. గుంటూరు నగరంలోనే 53 కేసులు నమోదయ్యాయి. ఒకే కుటుంబానికి చెందిన 10 మంది కరోనా వైరస్ బారిన పడ్డారు. దాచేపల్లి మండలం నారాయణపురంలో ఓ వ్యక్తి మరణించాడు. దీన్ని కూడా లెక్కలోకి తీసుకుంటే ఏపీలో కరోనా మరణాల సంఖ్య ఏడుకు చేరుకుంటుంది.
జిల్లాలవారీగా కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య ఇలా ఉంది...
అనంతపురం 15
చిత్తూరు 20
తూర్పు గోదావరి 17
గుంటూరు 72
కడప 30
కృష్ణా 35
కర్నూలు 82
నెల్లూరు 48
ప్రకాశం 41
విశాఖపట్నం 20