కాలినడకన తిరిగినా క్వారంటైన్ కే...ఏపి పోలీసులు వినూత్న ప్రయత్నం

By Arun Kumar P  |  First Published Apr 27, 2020, 10:18 PM IST

కరోనా నియంత్రణకు ఏపి పోలీసులు మరింత కఠినంగా వ్యవహరిస్తున్నారు. 


అమరావతి: కరోనా వైరస్ దేశవ్యాప్తంగా విలయ తాండవం చేస్తోంది. లాక్ డౌన్ విధించినప్పటికీ దేశంలో కేసులు పెరుగిపోతున్నాయి. ఏపిలో ఊహించని విధంగా కరోనా కేసులు వెయ్యి దాటాయి. పరిస్థితి రోజు రోజుకీ విషమంగా మారుతుంది. అయినప్పటికీ కొందరు బాధ్యతా రాహిత్యంగా వ్యవహరిస్తున్నారు.

ఇంట్లో నుంచి బయటకు అడుగుపెట్టొద్దని ప్రభుత్వాలు, పోలీసులు నెత్తీ, నోరు కొట్టుకొని మరీ హెచ్చరిస్తున్నారు. అయినా చాలా మంది ఖతారు చేయడం లేదు. కనీసం మూతికి మాస్క్ లు కూడా లేకుండా బయట తిరుగుతున్నారు. ప్రాణం మీద కొంచెం కూడా తీపి లేకుండా తిరిగేస్తున్నారు.

Latest Videos

undefined

లాటిలతో కొడితే చెడ్డ పేరు వస్తోంది... వాహనాలు సీజ్ చేస్తే నడుచుకొని తిరుగుతున్నారు... వదిలేద్దామా అంటే పాజిటివ్ కేసులు పెరుగుతున్నాయి... వీటన్నిటికి కొత్త మందు కనిపెట్టారు విజయవాడలోని కృష్ణలంక పోలీసులు. ఆదివారం నాడు  రాష్ట్రంలోనే అత్యధిక కేసులు ఇక్కడే పాజిటివ్ నమోదయ్యాయి. దీంతో పోలీస్ కమిషనర్ ద్వారకా తిరుమల రావు రంగంలోకి దిగి గట్టి చర్యలు చేపట్టారు.  

సీపీ ఆదేశాల మేరకు డిసిపి విక్రాంత  పాటిల్, ఏసీపీ నక్క సూర్యచంద్రరావు  ప్రత్యేక బృందాలతో రోడ్డుపైకి వచ్చేశారు. అనవసరంగా తిరుగుతూ రోడ్డుపైన దొరికిన వాళ్ళని  అంబులెన్సు ఎక్కించి కోరంటిన్కు పంపుతున్నారు.  ఫలితంగా కృష్ణలంక ప్రాంతం సోమవారం నాడు పూర్తిగా అదుపులోకి వచ్చింది. దీన్ని ఈలాగే కొనసాగిస్తామని  సౌత్ ఏసిపి  సూర్య చంద్ర  రావు చెప్పారు.

అలాగే  మొన్న గుంటూరు జిల్లాలో..  నేను మూర్ఖుడినంటూ ఓ సెల్ఫీ పాయింట్ పెట్టి మరీ.. ఫోటోలు తీసి శిక్ష విధించారు.   కర్నూలు జిల్లాలో పోలీసులు మరింత వింత శిక్ష విధించారు. మాస్క్‌ ధరించలేదని కర్నూలు జిల్లా బేతంచెర్లలో యువకులకు సీఐ పీటీ కేశవరెడ్డి వెరైటీ పనిష్‌మెంట్‌ ఇచ్చారు. ఆదివారం పట్టణంలో లాక్‌డౌన్‌ సమయంలో పాతబస్టాండులో ఇద్దరు యువకులు మాస్క్‌లు లేకుండా తిరుగుతుండడాన్ని సీఐ, కమిషనర్‌ రమే్‌షబాబు గమనించి వారి వేసుకున్న చొక్కా విప్పించి లోపల ఉన్న బనియన్లను మాస్క్‌లుగా కట్టించి వారిని పంపించారు. 

రెడ్‌జోన్‌ ప్రాంతాల్లోని ప్రజలు బయటికి వస్తే తప్పకుండా మాస్క్‌లు ధరించాలని, లేని పక్షంలో చర్యలు తప్పవని సీఐ హెచ్చరించారు. లాక్‌డౌన్‌ నిబంధనలు ప్రజలు తప్పకుండా పాటించాలని కోరారు.  

click me!