చంద్రబాబు ఫోటో తీసి జగన్ ఫోటో.. మేయర్ రచ్చ

By telugu teamFirst Published Jun 22, 2019, 1:48 PM IST
Highlights

విజయవాడ నగర మున్సిపల్ కౌన్సిల్ సమావేశంలో ముఖ్యమంత్రి, మాజీ ముఖ్యమంత్రిల ఫోటోలు వివాదానికి దారితీశాయి. చంద్రబాబు ఫోటో తీసి.. జగన్ ఫోటో పెట్టడాన్ని మేయర్ తప్పుపట్టారు.

విజయవాడ నగర మున్సిపల్ కౌన్సిల్ సమావేశంలో ముఖ్యమంత్రి, మాజీ ముఖ్యమంత్రిల ఫోటోలు వివాదానికి దారితీశాయి. చంద్రబాబు ఫోటో తీసి.. జగన్ ఫోటో పెట్టడాన్ని మేయర్ తప్పుపట్టారు.

పూర్తి వివరాల్లోకి వెళితే.... ఇటీవల జరిగిన ఎన్నికల్లో టీడీపీ ఓటమిపాలవ్వగా... వైసీపీ అధికారం చేపట్టిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ప్రభుత్వం మారడంతో... ఎన్టీఆర్, చంద్రబాబు ఫొటోలు తొలగించి జగన్ ఫొటోను అధికారులు కౌన్సిల్ హాలులో ఏర్పాటు చేశారు. ఈ విషయంపై మేయర్ శ్రీధర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎవరిని అడిగి జగన్ ఫొటో పెట్టారని అధికారులను ప్రశ్నించారు.
 
కార్పొరేషన్‌లో తాను చెప్పిందే చేయాలంటూ అధికారులకు మేయర్ శ్రీధర్ హుకుం జారీ చేశారు. జగన్ ఫోటోతో పాటు వైఎస్  ఫోటో కూడా పెట్టాలని వైసీపీ నేతలు డిమాండ్ చేశారు. అయితే... అందుకు మేయర్ అంగీకరించలేదు.  మళ్లీ చంద్రబాబు, ఎన్టీఆర్ ఫోటోలను పెట్టాలని అధికారులను ఆదేశించారు. 

దీనికి వైసీపీ నేతలు అంగీకరించలేదు. జగన్ ప్రస్తుత ముఖ్యమంత్రి అని ఆయన ఫోటో ఉండాల్సిందేనని అన్నారు. అంతేకాకుండా  చనిపోయిన ముఖ్యమంత్రులు ఫొటోలు కౌన్సిల్ హాలులో పెట్టడం సాంప్రదాయమని, ఎన్టీఆర్‌తో పాటు వైఎస్ ఫొటో కూడా పెట్టాలని వైసీపీ కౌన్సిలర్లు డిమాండ్ చేస్తున్నారు. దీంతో కౌన్సిల్ సమావేశం రసాభాసగా మారింది.

click me!