పెళ్లిరోజున ప్రమాదం.. కానిస్టేబుల్ మృతి

Published : Nov 20, 2020, 10:44 AM IST
పెళ్లిరోజున ప్రమాదం.. కానిస్టేబుల్ మృతి

సారాంశం

అమరేశ్వరరావు మోపిదేవి మండలం కొక్కిలిగడ్డ కొత్తపాలెంలోని అత్తమామల దగ్గర నుంచి బయలుదేరి స్వగ్రామమైన మొవ్వ మండలం గూడపాడు ద్విచక్ర వాహనంపై వస్తుండగా చల్లపల్లి వైపు వస్తున్న లారీ ఢీ కొంది.


పెళ్లి రోజున ఓ జంటను విధి విడదీసింది. ఐదేళ్ల క్రితం వారి పెళ్లి కాగా.. తమ ఐదో పెళ్లి రోజుని ఆనందంగా గడపాలని అనుకున్నారు. కాగా.. రోడ్డు ప్రమాదం వారిని విడదీసింది. భర్త చనిపోగా.. భార్య, పిల్లలు తీవ్రగాయాలపాలయ్యారు. ఈ సంఘటన అవనిగడ్డలో చోటుచేసుకోగా..  పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

విజయవాడకు చెందిన ఏఆర్ కానిస్టేబుల్ కేశాని అమరేశ్వరరావు(32) ఘంటసాల మండలం చిట్టూర్పు వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది.ఈ ప్రమాదంలో భార్య లావణ్యకు, కుమార్తె భవిష్యకు గాయాలు కాగా ఏడాదిన్న కుమారుడు ప్రమాదం నుంచి బయటపడ్డాడు. 

మొవ్వ మండలం గూడపాడుకు చెందిన అమరేశ్వరరావు మోపిదేవి మండలం కొక్కిలిగడ్డ కొత్తపాలెంలోని అత్తమామల దగ్గర నుంచి బయలుదేరి స్వగ్రామమైన మొవ్వ మండలం గూడపాడు ద్విచక్ర వాహనంపై వస్తుండగా చల్లపల్లి వైపు వస్తున్న లారీ ఢీ కొంది. ఈ ఘటనలో అమరేశ్వరరావు తలకు బలమైన గాయమై అక్కడికక్కడే మృతిచెందాడు. 

స్థానికుల సమాచారం అక్కడికి చేరుకున్న అంబులెన్స్‌ గాయాలపాలైన భార్య లావణ్య, కుమార్తె భవిష్యను ఆస్పత్రికి తరలించారు. కాగా  కుమార్తె  పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. కాగా.. అమరేశ్వరరావు, లావణ్యకు ఐదు సంవత్సరాల క్రితం పెళ్లి జరిగింది. వారి పెళ్లిరోజునే ఈ ప్రమాదం జరగడంతో.. అమరేశ్వరరావు ప్రాణాలు కోల్పోయాడు. ఈ మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. 

PREV
click me!

Recommended Stories

Raghurama Krishnam Raju: కోడిపందాలను ప్రారంభించిన ఏపీ డిప్యూటీ స్పీకర్ RRR | Asianet News Telugu
RK Roja Bhogi Lecebrations With Family: భోగి రోజు రంగురంగు ముగ్గులు వేసిన రోజా| Asianet News Telugu