చంద్రబాబు అవిశ్వాసం ప్రజలపై ప్రేమతో కాదు: కేవీపీ

First Published Jul 24, 2018, 5:31 PM IST
Highlights

ప్రజాస్వామ్య సూర్తికి విరుద్దంగా కేంద్రం వ్యవహరిస్తోందని  కాంగ్రెస్ ఎంపీ కేవీపి రామచంద్రరావు  ఆరోపించారు. ఏపీ విభజన హమీ చట్టాన్ని అమలు చేయాలని ఆయన డిమాండ్ చేశారు.
 

న్యూఢిల్లీ: ప్రజాస్వామ్య సూర్తికి విరుద్దంగా కేంద్రం వ్యవహరిస్తోందని  కాంగ్రెస్ ఎంపీ కేవీపి రామచంద్రరావు  ఆరోపించారు. ఏపీ విభజన హమీ చట్టాన్ని అమలు చేయాలని ఆయన డిమాండ్ చేశారు.

మంగళవారం నాడు  ఏపీకి ప్రత్యేక హోదా, విభజన హమీ చట్టంపై  రాజ్యసభలో  జరిగిన చర్చలో ఆయన పాల్గొన్నారు. యూపీఏ ప్రభుత్వం ఇచ్చిన హమీలను అమలు చేయాలని  డిమాండ్ చేశారు. నాలుగేళ్లుగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు హనీమూన్‌లో ఉన్నాయని ఆయన ఎద్దేవా చేశారు.  ఏపీ ప్రజలపై ప్రేమతో టీడీపీ కేంద్రంపై అవిశ్వాసం ప్రవేశపెట్టలేదని  కేవీపీ చెప్పారు.

ఏపీ విభజన హమీ చట్టంలో ఉన్నవాటినే  ప్రజలు అడుగుతున్నారని కేవీపీ గుర్తు చేశారు.  ఎన్నికల్లో లబ్దిపొందేందుకే  అవిశ్వాసాన్ని పెట్టిందన్నారు. ఏపీకి ప్రత్యేక హోదాను అమలు చేయాలని డిమాండ్ చేస్తే చాలా కాలంగా తాను ప్లకార్డు పట్టుకొని నిరసన వ్యక్తం చేసిన విషయాన్ని ఆయన ప్రస్తావించారు.

ప్లకార్డు లేకుండా  తొలిసారిగా  తాను రాజ్యసభలో ఉన్నానని కేవీపీ గుర్తు చేశారు. రాష్ట్రానికి ఇచ్చిన హమీలను అమలు చేయాలన్నారు.  కేవీపీ తెలుగులోనే  తన ప్రసంగాన్ని కొనసాగించారు. 
 

click me!