మోదీ శకం ముగిసింది.. ఇక రాహుల్ శకమే... తులసీ రెడ్డి

Published : May 02, 2019, 02:03 PM IST
మోదీ శకం ముగిసింది.. ఇక రాహుల్ శకమే... తులసీ రెడ్డి

సారాంశం

ప్రధానిగా మోదీ శకం ఈ ఎన్నికలతో ముగిసిందని.. కాంగ్రెస్ నేత తులసీ రెడ్డి అభిప్రాయపడ్డారు. ఇక మిగిలింది రాహుల్ శకం మొదలవ్వడమేనని ఆయన అభిప్రాయపడ్డారు. 


ప్రధానిగా మోదీ శకం ఈ ఎన్నికలతో ముగిసిందని.. కాంగ్రెస్ నేత తులసీ రెడ్డి అభిప్రాయపడ్డారు. ఇక మిగిలింది రాహుల్ శకం మొదలవ్వడమేనని ఆయన అభిప్రాయపడ్డారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ...అధికారం కోసం మోదీ ఎంతకైనా దిగజారుతారన్నారు. 

కాంగ్రెస్ నేతలు తనను చంపాలని చూస్తున్నారంటూ.. మోదీ దిగజారుడు వ్యాఖ్యలు చేస్తున్నారన్నారు. పిరికిపంద ప్రధానిగా ఉన్నందుకు పౌరుడిగా సిగ్గుపడుతున్నానని తులసీరెడ్డి వ్యాఖ్యానించారు. పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహించే విధంగా ప్రధాని వ్యాఖ్యలు చేయడం ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేయడమేనని తులసీరెడ్డి విమర్శించారు. ఈ ఎన్నికల్లో తమ పార్టీ కచ్చితంగా విజయం సాధిస్తుందని... రాహుల్ ప్రధాని అవ్వడం ఖాయమని చెప్పారు. 

PREV
click me!

Recommended Stories

IMD Cold Wave Alert : తెలుగు రాష్ట్రాల్లో టెంపరేచర్స్ కుప్పకూలడానికి .. చలి బీభత్సానికి కారణమేంటో తెలుసా?
Tirupati : టీటీడీలో మరో భారీ కుంభకోణం.. నకిలీ పట్టు వస్త్రాల పేరుతో రూ.55 కోట్ల మోసం